ఏమీ నెఱుఁగని నన్ను నింత సేసీనే వీఁడు
(॥పల్లవి॥)
ఏమీ నెఱుఁగని నన్ను నింత సేసీనే వీఁడు
సాములు నేరిపె నంటా చవులు వుట్టించీనే
(॥ఏమి॥)
గందము వూసే నంటా కపురమిచ్చే నంటా
కందువ లంటి మనలు గరగించీనే
పందెము వేసే నంటా పాపట దువ్వే నంటా
చిందరవందర చేసి సిగ్గు విడిపించీనే
(॥ఏమి॥)
సంగడిఁ గూచుండే నంటా సరులు దిద్దే నంటా
చెంగటనే వలపులు చిమ్మి రేఁచీనే
సంగాతము నేర్తు నంటా జవ్వనపుదాన నంటా
నంగవించి పొగడి న న్నాసలఁ బెట్టీనే
(॥ఏమి॥)
యేకత మాడే నంటా యిందరినీ యంపు మంటా
పైకొని న న్నిటు గూడి భమ్రయించీనే
ఆకు చుట్టి యిచ్చే నంటా అందల మెక్కించే నంటా
యీకడ శ్రీవేంకటేశుఁ డిల్లాలిఁ జేసీనే
(||pallavi||)
emī nĕṟum̐gani nannu niṁta sesīne vīm̐ḍu
sāmulu neribĕ naṁṭā savulu vuṭṭiṁchīne
(||emi||)
gaṁdamu vūse naṁṭā kaburamichche naṁṭā
kaṁduva laṁṭi manalu garagiṁchīne
paṁdĕmu vese naṁṭā pābaḍa duvve naṁṭā
siṁdaravaṁdara sesi siggu viḍibiṁchīne
(||emi||)
saṁgaḍim̐ gūsuṁḍe naṁṭā sarulu didde naṁṭā
sĕṁgaḍane valabulu simmi rem̐sīne
saṁgādamu nerdu naṁṭā javvanabudāna naṁṭā
naṁgaviṁchi pŏgaḍi na nnāsalam̐ bĕṭṭīne
(||emi||)
yegada māḍe naṁṭā yiṁdarinī yaṁpu maṁṭā
paigŏni na nniḍu gūḍi bhamrayiṁchīne
āgu suṭṭi yichche naṁṭā aṁdala mĕkkiṁche naṁṭā
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ ḍillālim̐ jesīne