Emee nerani namga vemtavesaalu sesevu

ఏమీ నేరని నంగ వెంతవేసాలు సేసేవు
Language

(॥పల్లవి॥)
ఏమీ నేరని నంగ వెంతవేసాలు సేసేవు
యీమేరనే రతివేళా నిట్టే వుండేవా

(॥॥)
ముసిముసినవ్వులతో ముందర నిలిచి చెలులఁ
బిసిపిసియెలుఁగులఁ బిలిచేవు
కసుగాటు మాటలు కఱచి కఱచి యాడే-
వెసఁగి ప్రియునియొద్ద నెంతగోలవే

(॥॥)
చిన్నిచిన్నిసిగ్గులతో చెలువునివద్ద నుండి
సన్నలెల్లాఁ జేసేవు సతులతోను
చన్నులపై పయ్యద సాఁ చి బిగించుకొంటాను
కన్నెవలె నొదిగేవు కడునెంతగోలవే

(॥॥)
జలజల చెమటలుజార నింతులమాఁటున
నిలుచుండి పతిమోము నిక్కిచూచేవు
వెలయు నన్నుఁ గూడె శ్రీవెంకటేశుఁడు తొలుతె
వోలిసి యితనిపాదా లొత్తే వెంతగోలవే

(||pallavi||)
emī nerani naṁga vĕṁtavesālu sesevu
yīmerane radiveḽā niṭṭe vuṁḍevā

(||||)
musimusinavvulado muṁdara nilisi sĕlulam̐
bisibisiyĕlum̐gulam̐ bilisevu
kasugāḍu māḍalu kaṟasi kaṟasi yāḍe-
vĕsam̐gi priyuniyŏdda nĕṁtagolave

(||||)
sinnisinnisiggulado sĕluvunivadda nuṁḍi
sannalĕllām̐ jesevu saduladonu
sannulabai payyada sām̐ si bigiṁchugŏṁṭānu
kannĕvalĕ nŏdigevu kaḍunĕṁtagolave

(||||)
jalajala sĕmaḍalujāra niṁtulamām̐ṭuna
nilusuṁḍi padimomu nikkisūsevu
vĕlayu nannum̐ gūḍĕ śhrīvĕṁkaḍeśhum̐ḍu tŏludĕ
volisi yidanibādā lŏtte vĕṁtagolave