ఏమీ నెఱఁగని నన్ను నింత సేసితి
(॥పల్లవి॥)
ఏమీ నెఱఁగని నన్ను నింత సేసితి
నీ మనసు కొలఁదిక నేనేమీ నెఱఁగ
(॥ఏమీ॥)
నిన్నుఁ బాసి వుండలేను నీమొగము చూచిచూచి
కన్ను రెప్ప మూయలేను కరఁగుతాను
యెన్నికె నీవంతలో నాయెదలోన నెలకొని
మన్నించఁగనట్టె మేను మరచితిఁ గాని
(॥ఏమీ॥)
తలఁచక మానలేను తమకాననప్పటిని
వొలిసి నీతో నవ్వకోరువలేను
వెలయ నీ వంతలోనే వెంట వెంట రాఁగాను
చలివలపులనే నే సమ్మతైతిఁ గాని
(॥ఏమీ॥)
చేయి చాఁచక మానను చేరి నీ మోవితీపులు
యేయెడఁ జవిచూడక యిటు మానను
ఆయమై శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
నాయండ నీవు గూడఁగా నమ్మితిఁ గాని
(||pallavi||)
emī nĕṟam̐gani nannu niṁta sesidi
nī manasu kŏlam̐diga nenemī nĕṟam̐ga
(||emī||)
ninnum̐ bāsi vuṁḍalenu nīmŏgamu sūsisūsi
kannu rĕppa mūyalenu karam̐gudānu
yĕnnigĕ nīvaṁtalo nāyĕdalona nĕlagŏni
manniṁcham̐ganaṭṭĕ menu marasidim̐ gāni
(||emī||)
talam̐saga mānalenu tamagānanappaḍini
vŏlisi nīdo navvagoruvalenu
vĕlaya nī vaṁtalone vĕṁṭa vĕṁṭa rām̐gānu
salivalabulane ne sammadaidim̐ gāni
(||emī||)
seyi sām̐saga mānanu seri nī movidībulu
yeyĕḍam̐ javisūḍaga yiḍu mānanu
āyamai śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
nāyaṁḍa nīvu gūḍam̐gā nammidim̐ gāni