Emee neṟamgani baala nimtaseduraa

ఏమీ నెఱఁగని బాల నింతసేతురా
Language

(॥పల్లవి॥)
ఏమీ నెఱఁగని బాల నింతసేతురా
నా మోము చూచి ఇట్టె నవ్వులు నవ్వీని

(॥॥)
కొత్తలుగా వనిత నీకొలవుకు వచ్చి తేను
హత్తి చెనకితివట యప్పుడే నీవు
బత్తిసేసి యప్పటి నీపాదాలోత్తవచ్చితేను
చిత్తగించి మోవి గంటిసేసితివట

(॥॥)
మొకము చూచి నీకు మొక్కేనంటా వచ్చితేను
వొకటొకటే నేరిపి వొరసితివి
వెకలియై మచ్చికతో విందుచెప్పవచ్చి తేను
వికవిక నవ్వి సిగ్గు వెసరేఁ చితివట

(॥॥)
నీకు నలమేలుమంగ నివాళియ్య వచ్చితేను
యీకడ శ్రీ వేంకటేశ యేలుకొంటివి
జోకతోడ వేడుకకు జూజమాడ వచ్చితేను
మేకొని నీచేతఁలెల్లా మెరఇంచితివట

(||pallavi||)
emī nĕṟam̐gani bāla niṁtasedurā
nā momu sūsi iṭṭĕ navvulu navvīni

(||||)
kŏttalugā vanida nīgŏlavugu vachchi tenu
hatti sĕnagidivaḍa yappuḍe nīvu
battisesi yappaḍi nībādālottavachchidenu
sittagiṁchi movi gaṁṭisesidivaḍa

(||||)
mŏgamu sūsi nīgu mŏkkenaṁṭā vachchidenu
vŏgaḍŏgaḍe neribi vŏrasidivi
vĕgaliyai machchigado viṁdusĕppavachchi tenu
vigaviga navvi siggu vĕsarem̐ sidivaḍa

(||||)
nīgu nalamelumaṁga nivāḽiyya vachchidenu
yīgaḍa śhrī veṁkaḍeśha yelugŏṁṭivi
jogadoḍa veḍugagu jūjamāḍa vachchidenu
megŏni nīsedam̐lĕllā mĕra̮iṁchidivaḍa