Emee nanamgamjaala mimta ninnu

ఏమీ ననఁగఁజాల మింత నిన్ను
Language

(॥పల్లవి॥)
ఏమీ ననఁగఁజాల మింత నిన్ను
దీమసాన నీకు నీవే తెలుసుటగాక

(॥ఏమీ॥)
కలికి వలచెనంటా కడల నాడుకొనేవు
నెలకొన్న నీమాఁటలు నీకేమెచ్చు
అలయింతురా మరి యంత సేసినవాఁడవు
నలఁగకుండాఁ బొందునడపుటగాక

(॥ఏమీ॥)
అప్పటి నవ్వు నవ్వేవు అండవాయదంటాను
నెప్పున నీచేఁతలు నీకే మెచ్చు
కొప్పువట్టి తీతురా గోమునఁ బెంచినవాఁడ
వొప్పురతుల మెల్లనే వోలార్చుటగాక

(॥ఏమీ॥)
సారె నిన్నుఁ గూడెనంటా సన్నలుసేసిచూపేవు
నేరుపు లిన్నియు నీవి నీకే మెచ్చు
జీరదీతురా యిట్టె శ్రీవేంకట మేలేవాఁడ
వోరలేక యిచ్చకమై వుండుటగాక

(||pallavi||)
emī nanam̐gam̐jāla miṁta ninnu
dīmasāna nīgu nīve tĕlusuḍagāga

(||emī||)
kaligi valasĕnaṁṭā kaḍala nāḍugŏnevu
nĕlagŏnna nīmām̐ṭalu nīgemĕchchu
alayiṁturā mari yaṁta sesinavām̐ḍavu
nalam̐gaguṁḍām̐ bŏṁdunaḍabuḍagāga

(||emī||)
appaḍi navvu navvevu aṁḍavāyadaṁṭānu
nĕppuna nīsem̐talu nīge mĕchchu
kŏppuvaṭṭi tīdurā gomunam̐ bĕṁchinavām̐ḍa
vŏppuradula mĕllane volārsuḍagāga

(||emī||)
sārĕ ninnum̐ gūḍĕnaṁṭā sannalusesisūbevu
nerubu linniyu nīvi nīge mĕchchu
jīradīdurā yiṭṭĕ śhrīveṁkaḍa melevām̐ḍa
voralega yichchagamai vuṁḍuḍagāga