ఏమీ ననఁ జాలము యెట్లైనఁ జేయుము
(॥పల్లవి॥)
ఏమీ ననఁ జాలము యెట్లైనఁ జేయుము
నీ మనసే వచ్చీఁగాక నేఁడే వేగిరమా
(॥ఏమీ॥)
మన్ననగలుగువారి మాటలెల్లాఁ జక్కనే
వున్నవారి మాటలెల్ల నూసివాసులే
పన్ని మగఁడు చేపట్టి పాటించినదే యాఁటది
సన్నలెంత సేసినాను సంతవారు సతమా
(॥ఏమీ॥)
చెల్లుబడిగలవారి చేఁతలెల్లా హితవే
చిల్లరవారి చేఁతలు చిరుచేఁదులే
బల్లిదునిచేతనుంటే పచ్చఁబూస మాణికమే
కల్లమాడ దొడ్డముద్ర కతకుఁ గాళ్ళున్నవా
(॥ఏమీ॥)
యిచ్చయెఁరిగినచోటి యెమ్మెలెల్ల సమ్మతే
తచ్చనైనచోటిపొందు తడతాఁకులే
అచ్చపు శ్రీవేంకటేశ అలు మేలుమంగను నేఁ
నిచ్చగించి కూడితిరి యిఁక మోసమున్నదా
(||pallavi||)
emī nanam̐ jālamu yĕṭlainam̐ jeyumu
nī manase vachchīm̐gāga nem̐ḍe vegiramā
(||emī||)
mannanagaluguvāri māḍalĕllām̐ jakkane
vunnavāri māḍalĕlla nūsivāsule
panni magam̐ḍu sebaṭṭi pāḍiṁchinade yām̐ṭadi
sannalĕṁta sesinānu saṁtavāru sadamā
(||emī||)
sĕllubaḍigalavāri sem̐talĕllā hidave
sillaravāri sem̐talu sirusem̐dule
ballidunisedanuṁṭe pachcham̐būsa māṇigame
kallamāḍa dŏḍḍamudra kadagum̐ gāḽḽunnavā
(||emī||)
yichchayĕm̐riginasoḍi yĕmmĕlĕlla sammade
tachchanainasoḍibŏṁdu taḍadām̐kule
achchabu śhrīveṁkaḍeśha alu melumaṁganu nem̐
nichchagiṁchi kūḍidiri yim̐ka mosamunnadā