Emee nanagure yichchagamule yaadare

ఏమీ ననకురే యిచ్చకములే యాడరే
Language

(॥పల్లవి॥)
ఏమీ ననకురే యిచ్చకములే యాడరే
చే ముంచి నవ్వకురే సిగ్గువడీ నాతఁడు

(॥ఏమీ॥)
గందము మేనఁబుయ్యరే కప్పురము నోటికీరే
యెందుండి వచ్చెనో విభుఁడింత యలసి
విందువలె మరి నేను వెనక మాటాడేఁగాని
చెంది మీరు మాటాడరే సిగ్గువడీ నాతఁడు

(॥ఏమీ॥)
దప్పికిఁ బన్నీ రియ్యరే తామరలు ముడువరే
కప్పి యేపనిసేసెనో కడునలసి
చప్పుడుగాక వెనక సంగడిఁ గూచుండేఁగాని
చిప్పిల మీరుండరే సిగ్గుపడీ నాతఁడు

(॥ఏమీ॥)
చేసురటి విసరరే శ్రీ వేంకటేశుఁడు నేఁడు
రాసికెక్క నన్నుఁ గూడె రతి నలసి
వేసరక యీసేసలే వెనకఁ బెట్టేఁగాని
సేసలు మీరు వెట్టరే సిగ్గుపడీ నాతఁడు

(||pallavi||)
emī nanagure yichchagamule yāḍare
se muṁchi navvagure sigguvaḍī nādam̐ḍu

(||emī||)
gaṁdamu menam̐buyyare kappuramu noḍigīre
yĕṁduṁḍi vachchĕno vibhum̐ḍiṁta yalasi
viṁduvalĕ mari nenu vĕnaga māḍāḍem̐gāni
sĕṁdi mīru māḍāḍare sigguvaḍī nādam̐ḍu

(||emī||)
dappigim̐ bannī riyyare tāmaralu muḍuvare
kappi yebanisesĕno kaḍunalasi
sappuḍugāga vĕnaga saṁgaḍim̐ gūsuṁḍem̐gāni
sippila mīruṁḍare siggubaḍī nādam̐ḍu

(||emī||)
sesuraḍi visarare śhrī veṁkaḍeśhum̐ḍu nem̐ḍu
rāsigĕkka nannum̐ gūḍĕ radi nalasi
vesaraga yīsesale vĕnagam̐ bĕṭṭem̐gāni
sesalu mīru vĕṭṭare siggubaḍī nādam̐ḍu