ఏమీ ననకున్న వారి నేల రేఁచేవు
(॥పల్లవి॥)
ఏమీ ననకున్న వారి నేల రేఁచేవు
నేమాన వంచిన తల నిక్కి చూడరాదా
(॥ఏమీ॥)
యేకతాన నే నిన్ను యేమన్నా నమరుఁగాక
ఆకెముందర నే నంటే నందమయ్యీనా
కాకు సేయ నిప్పుడేల కాని కాని అందుకేమి
చేకొని మొక్కినచేత సేవ సేయరాదా
(॥ఏమీ॥)
సరసమాడేటివేళ చనవులు చెల్లుఁగాక
యెరపరికపునీతో నింతదగునా
దొరవై వుండఁగ నిన్ను తుదముట్టించఁగ నేల
తిరుగఁ దిట్టిననోర దీవించరాదా
(॥ఏమీ॥)
నీవు నేను నిట్లెతై నిర్మలమై వుండుఁగాక
వేవేల తెరఁగులై తే వేడుక య్యీనా
శ్రీవేంకటేశ కూడితి చేకొని కడపలోన
వాని గలసినచోట వన్నె చూపరాదా
(||pallavi||)
emī nanagunna vāri nela rem̐sevu
nemāna vaṁchina tala nikki sūḍarādā
(||emī||)
yegadāna ne ninnu yemannā namarum̐gāga
āgĕmuṁdara ne naṁṭe naṁdamayyīnā
kāgu seya nippuḍela kāni kāni aṁdugemi
segŏni mŏkkinaseda seva seyarādā
(||emī||)
sarasamāḍeḍiveḽa sanavulu sĕllum̐gāga
yĕrabarigabunīdo niṁtadagunā
dŏravai vuṁḍam̐ga ninnu tudamuṭṭiṁcham̐ga nela
tirugam̐ diṭṭinanora dīviṁcharādā
(||emī||)
nīvu nenu niṭlĕdai nirmalamai vuṁḍum̐gāga
vevela tĕram̐gulai te veḍuga yyīnā
śhrīveṁkaḍeśha kūḍidi segŏni kaḍabalona
vāni galasinasoḍa vannĕ sūbarādā