Emee naduganolla hechchugumdu lananolla

ఏమీ నడుగనొల్ల హెచ్చుకుందు లననొల్ల
Language

(॥పల్లవి॥)
ఏమీ నడుగనొల్ల హెచ్చుకుందు లననొల్ల
కామించి నీవిచ్చితివి కైవల్యపదము

(॥ఏమీ॥)
పుట్టుగులకు వెఱవ భువిలోన హరి నీకు_
నట్టె నీదాసుఁడ నేనైతేఁ జాలు
వెట్టికి నే జాతియైన వెఱవ నీనామములు
వొట్టి నా నాలికమీఁద నుంటేఁజాలు

(॥ఏమీ॥)
దురితాలకు వెఱవఁ దుద వేయైనా హరి నీ_
కరుణఁ గైంకర్యము గలిగితేఁ జాలు
నిరతి నింద్రియాలకు నే వెఱవ నీ వాత్మఁ
బెరరేఁపకుఁడవై పెరిగితేఁ జాలు

(॥ఏమీ॥)
యేలోకమైనా వెఱవ యెప్పుడూ శ్రీవేంకటేశ
పాలించి నీకృప నాపైఁ బారితేఁ జాలు
కాలమెట్టయినా వెఱవ కర్మ మెట్టయినా వెఱవ
యేలిన నీదాసులు నన్నియ్యకొంటేఁ జాలును

(||pallavi||)
emī naḍuganŏlla hĕchchuguṁdu lananŏlla
kāmiṁchi nīvichchidivi kaivalyabadamu

(||emī||)
puṭṭugulagu vĕṟava bhuvilona hari nīgu̮
naṭṭĕ nīdāsum̐ḍa nenaidem̐ jālu
vĕṭṭigi ne jādiyaina vĕṟava nīnāmamulu
vŏṭṭi nā nāligamīm̐da nuṁṭem̐jālu

(||emī||)
duridālagu vĕṟavam̐ duda veyainā hari nī̮
karuṇam̐ gaiṁkaryamu galigidem̐ jālu
niradi niṁdriyālagu ne vĕṟava nī vātmam̐
bĕrarem̐pagum̐ḍavai pĕrigidem̐ jālu

(||emī||)
yelogamainā vĕṟava yĕppuḍū śhrīveṁkaḍeśha
pāliṁchi nīkṛpa nābaim̐ bāridem̐ jālu
kālamĕṭṭayinā vĕṟava karma mĕṭṭayinā vĕṟava
yelina nīdāsulu nanniyyagŏṁṭem̐ jālunu