ఏమీ నడుగ నొల్ల నెచ్చుకొందు లన నొల్ల
(॥పల్లవి॥)
ఏమీ నడుగ నొల్ల నెచ్చుకొందు లన నొల్ల
కామించి నీ విచ్చితి కైవల్యపదము
(॥ఏమీ॥)
పుట్టుగులకు వెరవ భూమిలోన హరి నీకు
అట్టె నీ దాసుఁడ నేనైతేఁ జాలు
వెట్టికి నేజాతినైనా వెరవ నీనామములు
వొట్టి నా నాలికమీఁద నుండితేఁ జాలు
(॥ఏమీ॥)
వెఱవఁ బాపములకు వేయైనా హరి నీ
యఱలేని కైంకర్యమిచ్చితేఁ జాలు
వెఱవ నింద్రియముల వెతలకు నీ వాత్మ
నుఱక బోధనుండవై వుండితేఁ జాలు
(॥ఏమీ॥)
ఏ లోకమైన వెరవ యెక్కు శ్రీ వేంకటేశ
పాలించి నీకృప నాపఁ బారితేఁ జాలు
కాల మెట్లైన వెరవ కర్మ మెట్లైన వెరవ
యేలిన నీదాలు నన్నియ్యకొంటేఁ జాలు
(||pallavi||)
emī naḍuga nŏlla nĕchchugŏṁdu lana nŏlla
kāmiṁchi nī vichchidi kaivalyabadamu
(||emī||)
puṭṭugulagu vĕrava bhūmilona hari nīgu
aṭṭĕ nī dāsum̐ḍa nenaidem̐ jālu
vĕṭṭigi nejādinainā vĕrava nīnāmamulu
vŏṭṭi nā nāligamīm̐da nuṁḍidem̐ jālu
(||emī||)
vĕṟavam̐ bābamulagu veyainā hari nī
yaṟaleni kaiṁkaryamichchidem̐ jālu
vĕṟava niṁdriyamula vĕdalagu nī vātma
nuṟaga bodhanuṁḍavai vuṁḍidem̐ jālu
(||emī||)
e logamaina vĕrava yĕkku śhrī veṁkaḍeśha
pāliṁchi nīkṛpa nābam̐ bāridem̐ jālu
kāla mĕṭlaina vĕrava karma mĕṭlaina vĕrava
yelina nīdālu nanniyyagŏṁṭem̐ jālu