(॥పల్లవి॥)
ఏమే యింతటిదాన వెఱుఁగవటే
నామాట సరివచ్చేనా నేఁడు నీకు
(॥॥)
యెగసక్కెపుమాటలు యెన్నైనా నాడఁగవచ్చు
అగపడి ప్రియమాడే దరుదుగాని
మగవానితోడనేల మారుకొనఁగఁ జెలికి
మొగమోట ప్రియముతో మొక్కవలెఁగాక
(॥॥)
బచ్చెనపంతములను బయలీఁదించఁగవచ్చు
నిచ్చఁ బొందు జరపేది నేరుపుగాని
యిచ్చకపుఁ బతితోడ నెమ్మెలేల మగువకు
యెచ్చుఁగుందులేక కాఁగి లియ్యవలెఁగాక
(॥॥)
నలిరేఁగి కేరడపునవ్వులు నవ్వఁగవచ్చు
యెలిమి సరసమాడే దెక్కుడుగాని
అలమేలుమంగవు నిన్నతఁడు శ్రీవేంకటేశుఁ-
డలమె నిట్టె ముదమందవలెఁగాక
(||pallavi||)
eme yiṁtaḍidāna vĕṟum̐gavaḍe
nāmāḍa sarivachchenā nem̐ḍu nīgu
(||||)
yĕgasakkĕbumāḍalu yĕnnainā nāḍam̐gavachchu
agabaḍi priyamāḍe darudugāni
magavānidoḍanela mārugŏnam̐gam̐ jĕligi
mŏgamoḍa priyamudo mŏkkavalĕm̐gāga
(||||)
bachchĕnabaṁtamulanu bayalīm̐diṁcham̐gavachchu
nichcham̐ bŏṁdu jarabedi nerubugāni
yichchagabum̐ badidoḍa nĕmmĕlela maguvagu
yĕchchum̐guṁdulega kām̐gi liyyavalĕm̐gāga
(||||)
nalirem̐gi keraḍabunavvulu navvam̐gavachchu
yĕlimi sarasamāḍe dĕkkuḍugāni
alamelumaṁgavu ninnadam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍalamĕ niṭṭĕ mudamaṁdavalĕm̐gāga