Eme yimdarilona nemtagarvame

ఏమే యిందరిలోన నెంతగర్వమే
Language

(॥పల్లవి॥)
ఏమే యిందరిలోన నెంతగర్వమే
నీ మగఁడు మన్నించితే నీకొద్దా వినయము

(॥॥)
మొక్కలానఁ బతివద్ద ముందర ముందర వచ్చి
కక్కసించి కూచుండేవు గద్దెమీఁదను
చక్కని కొలువులోని సతులిందరునుఁ జూచి
వొక్కరొక్కరి మొగాలు వొగిఁ జూచేరదివో

(॥॥)
చెమటలు వెట్టఁగాను చెలువుని తొడమీఁద
నమరంగఁ బవళించే వప్పటి నీవు
కొమరె సవతులెల్లా గుజగుజ లాడుకొంటా
తమకాన జిన్నఁబోయి తలవంచే రదివో

(॥॥)
సెలవుల నవ్వుకొంటా శ్రీవేంకటేశ్వరుని
తిలకించి కూడితివి తెరవేసుక
చెలులెల్లా నిద్దరికి సేవలెల్లాఁ జేసి చేసి
సొలసి మిమ్ము మెప్పించి చుట్టాలైరిదివో

(||pallavi||)
eme yiṁdarilona nĕṁtagarvame
nī magam̐ḍu manniṁchide nīgŏddā vinayamu

(||||)
mŏkkalānam̐ badivadda muṁdara muṁdara vachchi
kakkasiṁchi kūsuṁḍevu gaddĕmīm̐danu
sakkani kŏluvuloni saduliṁdarunum̐ jūsi
vŏkkarŏkkari mŏgālu vŏgim̐ jūseradivo

(||||)
sĕmaḍalu vĕṭṭam̐gānu sĕluvuni tŏḍamīm̐da
namaraṁgam̐ bavaḽiṁche vappaḍi nīvu
kŏmarĕ savadulĕllā gujaguja lāḍugŏṁṭā
tamagāna jinnam̐boyi talavaṁche radivo

(||||)
sĕlavula navvugŏṁṭā śhrīveṁkaḍeśhvaruni
tilagiṁchi kūḍidivi tĕravesuga
sĕlulĕllā niddarigi sevalĕllām̐ jesi sesi
sŏlasi mimmu mĕppiṁchi suṭṭālairidivo