(॥పల్లవి॥)
ఏమే యిది నీ వెఱఁగనిదా
కామించి సొలయఁగా గసరుదురా
(॥ఏమే॥)
నంటున నీతో నవ్వేరమణుని
గొంటుఁదనంబున గుంపితురా
అంటుచు నీచన్ను లటు గని మొక్కఁగ
వెంటగా నానలు పెట్టుదురా
(॥ఏమే॥)
తమకపు టాసల తప్పక చూచితే
సముకానఁ బతిని జఱయుదురా
ప్రమదంబున నీ పాదము దొక్కఁగ
జమళి బొమ్మలను జంకింతురా
(॥ఏమే॥)
శ్రీవేంకటేశుఁడు చేరి కూడె నిను
లావగురతుల నలయింతురా
కావరించి మరీఁ గాఁగిలించఁగా
ఆవలఁ బంతాలాడుదురా
(||pallavi||)
eme yidi nī vĕṟam̐ganidā
kāmiṁchi sŏlayam̐gā gasarudurā
(||eme||)
naṁṭuna nīdo navveramaṇuni
gŏṁṭum̐danaṁbuna guṁpidurā
aṁṭusu nīsannu laḍu gani mŏkkam̐ga
vĕṁṭagā nānalu pĕṭṭudurā
(||eme||)
tamagabu ṭāsala tappaga sūside
samugānam̐ badini jaṟayudurā
pramadaṁbuna nī pādamu dŏkkam̐ga
jamaḽi bŏmmalanu jaṁkiṁturā
(||eme||)
śhrīveṁkaḍeśhum̐ḍu seri kūḍĕ ninu
lāvaguradula nalayiṁturā
kāvariṁchi marīm̐ gām̐giliṁcham̐gā
āvalam̐ baṁtālāḍudurā