(॥పల్లవి॥)
ఏమే యెఱఁగవా యేకతపు సరసము
కామించినాతని నింత కాకుసేతురా
(॥॥)
చెంతనుండి యాతఁడు నీచెఱఁగువట్టి తీసితే
పంతములాడుదురా పతితోను
అంతరంగ మనుచు నీయండ నిట్టె కూచుండితే
రంతుసేసి మాటలాడి రవ్వసేతురా
(॥॥)
సన్నలకు నీకొప్పు జార నాతఁ డు దీసితే
కన్నుల జంకింతురా కాంతునిని
మన్ననల సిగ్గులమాటలు దడవితేను
పన్ని సతులలో నెల్లాఁ బచ్చిసేతురా
(॥॥)
అలమేలుమంగవు నీవు నిన్నట్టె కాఁగిటఁ గూడితే
యెలయింతురా శ్రీ వేంకటేశ్వరుని
వలపులు రేఁచి రతి వక్కణ నీకుఁ జెప్పితే
వెలయ నంతటా వెల్లవిరి సేతురా
(||pallavi||)
eme yĕṟam̐gavā yegadabu sarasamu
kāmiṁchinādani niṁta kāgusedurā
(||||)
sĕṁtanuṁḍi yādam̐ḍu nīsĕṟam̐guvaṭṭi tīside
paṁtamulāḍudurā padidonu
aṁtaraṁga manusu nīyaṁḍa niṭṭĕ kūsuṁḍide
raṁtusesi māḍalāḍi ravvasedurā
(||||)
sannalagu nīgŏppu jāra nādam̐ ḍu dīside
kannula jaṁkiṁturā kāṁtunini
mannanala siggulamāḍalu daḍavidenu
panni sadulalo nĕllām̐ bachchisedurā
(||||)
alamelumaṁgavu nīvu ninnaṭṭĕ kām̐giḍam̐ gūḍide
yĕlayiṁturā śhrī veṁkaḍeśhvaruni
valabulu rem̐si radi vakkaṇa nīgum̐ jĕppide
vĕlaya naṁtaḍā vĕllaviri sedurā