Eme yemta nerubari videṟamgavaa

ఏమే యెంత నేరుపరి విదెఱఁగవా
Language

(॥పల్లవి॥)
ఏమే యెంత నేరుపరి విదెఱఁగవా
ప్రేమ మతి కడతురా బెరయుటగాక

(॥ఏమే॥)
కన్నుల మొక్కినమీఁద కాఁకలు చల్లుదురా
సన్నలనే వలపులు చల్లుటగాక
చన్నులు చేతికిఁ జిక్కె సారెనిఁకలోఁగుదురా
వెన్నెలనవ్వులు నవ్వి వేఁడుకొంటగాక

(॥ఏమే॥)
పాదాలు చాఁచినమీదఁ పంతాలు నెరపుదురా
సేదదేర సేవలు సేయుటగాక
ఆదిగొని కాఁగిలించె నాసలు వెట్టుదురా
సాదువలె భోగములు చవిగొంటగాక

(॥ఏమే॥)
ఆయములంటినమీఁద అరగోరసేతురా
పాయనిసమరతులఁ బైకొంటగాక
యీయెడ శ్రీవేంకటేశుఁడేలె సిగ్గువడుదురా
కాయములు సోఁక నిట్టె కలయుటగాక

(||pallavi||)
eme yĕṁta nerubari vidĕṟam̐gavā
prema madi kaḍadurā bĕrayuḍagāga

(||eme||)
kannula mŏkkinamīm̐da kām̐kalu salludurā
sannalane valabulu salluḍagāga
sannulu sedigim̐ jikkĕ sārĕnim̐kalom̐gudurā
vĕnnĕlanavvulu navvi vem̐ḍugŏṁṭagāga

(||eme||)
pādālu sām̐sinamīdam̐ paṁtālu nĕrabudurā
sedadera sevalu seyuḍagāga
ādigŏni kām̐giliṁchĕ nāsalu vĕṭṭudurā
sāduvalĕ bhogamulu savigŏṁṭagāga

(||eme||)
āyamulaṁṭinamīm̐da aragorasedurā
pāyanisamaradulam̐ baigŏṁṭagāga
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ḍelĕ sigguvaḍudurā
kāyamulu som̐ka niṭṭĕ kalayuḍagāga