ఏమే విభునినేల యెలయించేవే నీ
(॥పల్లవి॥)
ఏమే విభునినేల యెలయించేవే నీ-
మోమున సింగారాలు మొలచున్నవి
(॥॥)
సెలవుల నొకమాటు చేరి నీవు నవ్వితేనే
వెలలేని మహిమల వెన్నెల గాయు
తళుకున నీవటు తప్పక చూచితేనే
నిలువెల్లాఁ జీఁకటుల నిగ్గుదేరును
(॥॥)
మురిపేన వాతెరమోవి నీవు చూపితేనే
సొరిదినే పగడాలసోంపు నిండును
మరుగుచు నీవిట్టె మాటలు సారె నాడితే
యిరవై కప్రపుపల్కులిటు నిండును
(॥॥)
సందడి నీపయ్యదలో చన్నులు చూపితేనే
కుందణంపువన్నెలెల్లా గుదిగొనును
కందువ శ్రీవేంకటేశుఁ గాఁగిట నీవు గూడితే
యెందు నలమేల్మంగ నీయిరవు గాన్పించును
(||pallavi||)
eme vibhuninela yĕlayiṁcheve nī-
momuna siṁgārālu mŏlasunnavi
(||||)
sĕlavula nŏgamāḍu seri nīvu navvidene
vĕlaleni mahimala vĕnnĕla gāyu
taḽuguna nīvaḍu tappaga sūsidene
niluvĕllām̐ jīm̐kaḍula nigguderunu
(||||)
muribena vādĕramovi nīvu sūbidene
sŏridine pagaḍālasoṁpu niṁḍunu
marugusu nīviṭṭĕ māḍalu sārĕ nāḍide
yiravai kaprabubalguliḍu niṁḍunu
(||||)
saṁdaḍi nībayyadalo sannulu sūbidene
kuṁdaṇaṁpuvannĕlĕllā gudigŏnunu
kaṁduva śhrīveṁkaḍeśhum̐ gām̐giḍa nīvu gūḍide
yĕṁdu nalamelmaṁga nīyiravu gānpiṁchunu