ఏమే సేసినమేలు ఇయ్యకోవద్దా
(॥పల్లవి॥)
ఏమే సేసినమేలు ఇయ్యకోవద్దా
సొములేలే గందవొడి చల్లేనంటేను
(॥॥)
మెక్కేవేమే వద్దంటాను మోహాన నీరమణుఁడు
యిక్కువతో నాకుమడిచి యిచ్చేనంటేను
పిక్కటిల్లుచన్నులతోఁ బెనఁగులాడేవేమే
చుక్కబొట్టు నొసలఁ జక్కఁబెట్టే నంటేను
(॥॥)
అండుకాచే వదియేమే అదరించి యాతఁడు
పెండెము నీపాదమునఁ బెట్టేనంటేను
వెండియు నాతని వెనవెనక కేఁగేవేమే
కొండవలెఁ దొడమీఁదఁ గూచుండుమంటేను
(॥॥)
వేవేలుచందముల వేఁడుకొనే వదియేమే
శ్రీ వేంకటేశుఁ డక్కునఁ జేర్చేనంటేను
భావించి వినయాలే పచరించే వదియేమే
యీవేళ నిన్నెనసి మోవిమ్మని యంటేను
(||pallavi||)
eme sesinamelu iyyagovaddā
sŏmulele gaṁdavŏḍi sallenaṁṭenu
(||||)
mĕkkeveme vaddaṁṭānu mohāna nīramaṇum̐ḍu
yikkuvado nāgumaḍisi yichchenaṁṭenu
pikkaḍillusannuladom̐ bĕnam̐gulāḍeveme
sukkabŏṭṭu nŏsalam̐ jakkam̐bĕṭṭe naṁṭenu
(||||)
aṁḍugāse vadiyeme adariṁchi yādam̐ḍu
pĕṁḍĕmu nībādamunam̐ bĕṭṭenaṁṭenu
vĕṁḍiyu nādani vĕnavĕnaga kem̐geveme
kŏṁḍavalĕm̐ dŏḍamīm̐dam̐ gūsuṁḍumaṁṭenu
(||||)
vevelusaṁdamula vem̐ḍugŏne vadiyeme
śhrī veṁkaḍeśhum̐ ḍakkunam̐ jersenaṁṭenu
bhāviṁchi vinayāle pasariṁche vadiyeme
yīveḽa ninnĕnasi movimmani yaṁṭenu