Eme samga teramga vimtiro neevu

ఏమే సంగ తెరఁగ వింతిరో నీవు
Language

(॥పల్లవి॥)
ఏమే సంగ తెరఁగ వింతిరో నీవు
ఆమె కులువ చరించకయ్యో నీవు

(॥ఏమే॥)
సంకె లేక యాతఁడు జాణఁడై తిరుగఁగాను
అంకెలకు వంక లొత్తే వప్పటినీవు
మంకుదానఁ దొలుతనె మారు మలయఁగఁ బైపై
నింకా బుద్దులు చెప్పే వెట్టో నీవు

(॥ఏమే॥)
వొడ్డినందు కెల్లా నాతఁ డోపికతో నుండఁగాను
అడ్డాలు దుడ్డాలు వచ్చే వప్పటి నీవు
వడ్డివారె శిగ్గుతోడి వనితను వానిఁ దెచ్చి
జిడ్డు దేర నవ్వించేవు చీచీ నీవు

(॥ఏమే॥)
బలిమిఁ గాఁగిటఁ గూడి బడలి వాఁ డుండఁగాను
అలపు సొలపుఁ దేర్చే వప్పటినీవు
యెలమి శ్రీవెంకటేశు నెదలోనిదాన నేను
చెలరేఁగించే విన్నిటాఁ జెల్లునె నీవు

(||pallavi||)
eme saṁga tĕram̐ga viṁtiro nīvu
āmĕ kuluva sariṁchagayyo nīvu

(||eme||)
saṁkĕ lega yādam̐ḍu jāṇam̐ḍai tirugam̐gānu
aṁkĕlagu vaṁka lŏtte vappaḍinīvu
maṁkudānam̐ dŏludanĕ māru malayam̐gam̐ baibai
niṁkā buddulu sĕppe vĕṭṭo nīvu

(||eme||)
vŏḍḍinaṁdu kĕllā nādam̐ ḍobigado nuṁḍam̐gānu
aḍḍālu duḍḍālu vachche vappaḍi nīvu
vaḍḍivārĕ śhiggudoḍi vanidanu vānim̐ dĕchchi
jiḍḍu dera navviṁchevu sīsī nīvu

(||eme||)
balimim̐ gām̐giḍam̐ gūḍi baḍali vām̐ ḍuṁḍam̐gānu
alabu sŏlabum̐ derse vappaḍinīvu
yĕlami śhrīvĕṁkaḍeśhu nĕdalonidāna nenu
sĕlarem̐giṁche vinniḍām̐ jĕllunĕ nīvu