ఏమే నీ చలము నేఁడెంత కెంతే
(॥పల్లవి॥)
ఏమే నీ చలము నేఁడెంత కెంతే
దీమసాన మొక్కఁగానే తిట్టుకొనేవు
(॥ఏమే॥)
పానుపుమీఁదనే వుండి పలికేపు నేఁడు
పేని పట్టాతడు నిన్నుఁ బిలువఁగాను
మోనాన వేసాలకు ములిగేవు యిట్టె
నానఁ బెట్టాతఁడు నీతో నవ్వు నవ్వఁగాను
(॥ఏమే॥)
నిండా ముసుఁగు వెట్టుక నిద్దిరించేవు ఆతఁ-
డండనే కూచుండి నిన్ను నలమఁగాను
వుండుండి చెలులఁ బిలిచే వొద్దికి నీవు
దండిగా నాతఁడు తానె తలుపు మూయఁగను
(॥ఏమే॥)
మరిగి మాటున యాకు మడి చిచ్చేవు
కరఁగి యాతఁడు నీ మొగము చూడఁగా
అరసి శ్రీవేంకటేశుఁ డలమేలమంగ నిన్నుఁ
గెరలి కూడినమీఁద గేలిసేసేవు
(||pallavi||)
eme nī salamu nem̐ḍĕṁta kĕṁte
dīmasāna mŏkkam̐gāne tiṭṭugŏnevu
(||eme||)
pānubumīm̐dane vuṁḍi paligebu nem̐ḍu
peni paṭṭādaḍu ninnum̐ biluvam̐gānu
monāna vesālagu muligevu yiṭṭĕ
nānam̐ bĕṭṭādam̐ḍu nīdo navvu navvam̐gānu
(||eme||)
niṁḍā musum̐gu vĕṭṭuga niddiriṁchevu ādam̐-
ḍaṁḍane kūsuṁḍi ninnu nalamam̐gānu
vuṁḍuṁḍi sĕlulam̐ bilise vŏddigi nīvu
daṁḍigā nādam̐ḍu tānĕ talubu mūyam̐ganu
(||eme||)
marigi māḍuna yāgu maḍi sichchevu
karam̐gi yādam̐ḍu nī mŏgamu sūḍam̐gā
arasi śhrīveṁkaḍeśhum̐ ḍalamelamaṁga ninnum̐
gĕrali kūḍinamīm̐da gelisesevu