Eme nee pamtamellaa niduvamtidaa

ఏమే నీ పంతమెల్లా నిటువంటిదా
Language

(॥పల్లవి॥)
ఏమే నీ పంతమెల్లా నిటువంటిదా
నేమముతో నా వలెనే నీటు చూపవలదా

(॥ఏమ॥)
చేరి నాతోఁ గాఁపురము సేయఁగా నాతని మీఁద
కూరిమి యెంత చల్లేవే కొత్తఁగా నీవు
నేరు పెంత గలిగినా సెలఁతల వలపులు
యారీతిఁ గాకుసేసే దెంతైనాఁ గలదా

(॥ఏమే॥)
కాతరించి నాతోను కమ్మటి మాటాడేవాని
చేతికి విడెమియ్యఁ జెల్లునా నీకు
పోతరము గలదంటా పొలఁతుల సిగ్గులు
యాతల బాయట వేసే దెందైనాఁ గలదా

(॥ఏమే॥)
చెలఁగి నాకాఁగిటిలో శ్రీవేంకటేశుఁ డుండఁగా
వెలినుండి నీవు నవ్వేవిధ మేఁటిదే
కలిమి గలిగితేను కామినుల భోగములు
యెలమి రవ్వలుసేసే దెందైనాఁ గలదా

(||pallavi||)
eme nī paṁtamĕllā niḍuvaṁṭidā
nemamudo nā valĕne nīḍu sūbavaladā

(||ema||)
seri nādom̐ gām̐puramu seyam̐gā nādani mīm̐da
kūrimi yĕṁta salleve kŏttam̐gā nīvu
neru pĕṁta galiginā sĕlam̐tala valabulu
yārīdim̐ gāgusese dĕṁtainām̐ galadā

(||eme||)
kādariṁchi nādonu kammaḍi māḍāḍevāni
sedigi viḍĕmiyyam̐ jĕllunā nīgu
podaramu galadaṁṭā pŏlam̐tula siggulu
yādala bāyaḍa vese dĕṁdainām̐ galadā

(||eme||)
sĕlam̐gi nāgām̐giḍilo śhrīveṁkaḍeśhum̐ ḍuṁḍam̐gā
vĕlinuṁḍi nīvu navvevidha mem̐ṭide
kalimi galigidenu kāminula bhogamulu
yĕlami ravvalusese dĕṁdainām̐ galadā