ఏమే నమ్మితిఁగదే యింకానేల దాఁచేవు
(॥పల్లవి॥)
ఏమే నమ్మితిఁగదే యింకానేల దాఁచేవు
చే ముంచితివేమో నాకుఁ జెప్పవే యా కతలు
(॥ఏమే॥)
కళలు మోమునఁ దేరీఁ గారీఁ బెఁ(బెం?) జెమటలు
చెలి నిన్నాతఁడేమైనాఁ జెనకెనటె
పిలువ నిన్నంపితేను పెనఁగులాడితివేమో
సెలవి నేమినవ్వేవు చెప్పవే యాకతలు
(॥ఏమే॥)
నాతి నీకొప్పదె జారె నలఁ గెఁ గట్టినచీర
ఆతఁడేమైనా నిన్ను నంటెనటవె
రాతిరెల్లా నాడనుండి రచ్చలు సేసితివేమో
చేతిసన్నేమి చూపేవు చెప్పవే యాకతలు
(॥ఏమే॥)
మోవిపైఁ గెంపులు నిండె ముడిచిన కొప్పు జారె
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జెందెనటవే
నీవెంటనే వచ్చి తాను నేఁడు నన్నూ నేలెఁ బతి
సేవ లేమిసేసేవు చెప్పవే యాకతలు
(||pallavi||)
eme nammidim̐gade yiṁkānela dām̐sevu
se muṁchidivemo nāgum̐ jĕppave yā kadalu
(||eme||)
kaḽalu momunam̐ derīm̐ gārīm̐ bĕm̐(bĕṁ?) jĕmaḍalu
sĕli ninnādam̐ḍemainām̐ jĕnagĕnaḍĕ
piluva ninnaṁpidenu pĕnam̐gulāḍidivemo
sĕlavi neminavvevu sĕppave yāgadalu
(||eme||)
nādi nīgŏppadĕ jārĕ nalam̐ gĕm̐ gaṭṭinasīra
ādam̐ḍemainā ninnu naṁṭĕnaḍavĕ
rādirĕllā nāḍanuṁḍi rachchalu sesidivemo
sedisannemi sūbevu sĕppave yāgadalu
(||eme||)
movibaim̐ gĕṁpulu niṁḍĕ muḍisina kŏppu jārĕ
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jĕṁdĕnaḍave
nīvĕṁṭane vachchi tānu nem̐ḍu nannū nelĕm̐ badi
seva lemisesevu sĕppave yāgadalu