Emduvoyeem daanu yela maane nenu

ఎందువోయీఁ దాను యేల మానే నేను
Language

(॥పల్లవి॥)
ఎందువోయీఁ దాను యేల మానే నేను
సందడి వేఁడి కాఁకలు చల్లారనీవే

(॥ఎందు॥)
తమి యెంతరేఁగినాను తగులమౌఁ బొందులు
తెమలి పొద్దులు వుచ్చితే నేమాయనే
చెమటెంత పుట్టినాను చిగిరించు వలపులు
సముకాన సరసము సాముసేయ నియ్యవే

(॥ఎందు॥)
నగవెంత గలిగినా ననుపులు సతమౌను
యెగసక్కేన నుండితే నేమాయనే
తగవెంత నడపినా తరితీపౌఁ బనులెల్లా
మొగమెదుటనే కొంత మొక్కులాడనీవే

(॥ఎందు॥)
భావమెంత చిక్కినాను పరవశములు మించు
తావుల మనోరథాలు తలఁచనీవే
యీవేళ శ్రీవేంకటేశుఁ డిట్టే నన్నుఁ గూడినాఁడు
వేవేలుప్రియములు వెదచల్లనీవే

(||pallavi||)
ĕṁduvoyīm̐ dānu yela māne nenu
saṁdaḍi vem̐ḍi kām̐kalu sallāranīve

(||ĕṁdu||)
tami yĕṁtarem̐ginānu tagulamaum̐ bŏṁdulu
tĕmali pŏddulu vuchchide nemāyane
sĕmaḍĕṁta puṭṭinānu sigiriṁchu valabulu
samugāna sarasamu sāmuseya niyyave

(||ĕṁdu||)
nagavĕṁta galiginā nanubulu sadamaunu
yĕgasakkena nuṁḍide nemāyane
tagavĕṁta naḍabinā taridībaum̐ banulĕllā
mŏgamĕduḍane kŏṁta mŏkkulāḍanīve

(||ĕṁdu||)
bhāvamĕṁta sikkinānu paravaśhamulu miṁchu
tāvula manorathālu talam̐sanīve
yīveḽa śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭe nannum̐ gūḍinām̐ḍu
vevelupriyamulu vĕdasallanīve