ఎందువోయీ వలపులు ఇల్లాల నేను
(॥పల్లవి॥)
ఎందువోయీ వలపులు ఇల్లాల నేను
ముందర నిలువవయ్య మొక్కేము నీకు
(॥॥)
జిగినూడిగపు వారు సేవలెల్లాఁ జేయఁగాను
తగినయిల్లాండ్ల పైఁ దలఁపున్నదా
మగఁడు గలవనే మాట గలిగితేఁ జాలు
మొగము చూపవయ్య మొక్కెము నీకు
(॥॥)
ఆసవెట్టి మగనాండ్లు అట్టె కానుక లంపఁగా
సేసవెట్టినాండ్లపైఁ జిత్తమున్నదా
యీసులేక నీవు నవ్వేయీపెద్దరికమే చాలు
మోసములేదు రావయ్య మొక్కేము నీకు
(॥॥)
పొట్టబొరుగుసతులు పొంచి సేవసేయఁగా
పట్టపుదేవులమీఁద బాఁతి వున్నదా
అట్టె శ్రీ వేంకటేశ అలమేలుమంగను నేను
ముట్టి నన్నుఁ గూడితివి మొక్కేము నీకు
(||pallavi||)
ĕṁduvoyī valabulu illāla nenu
muṁdara niluvavayya mŏkkemu nīgu
(||||)
jiginūḍigabu vāru sevalĕllām̐ jeyam̐gānu
taginayillāṁḍla paim̐ dalam̐punnadā
magam̐ḍu galavane māḍa galigidem̐ jālu
mŏgamu sūbavayya mŏkkĕmu nīgu
(||||)
āsavĕṭṭi maganāṁḍlu aṭṭĕ kānuga laṁpam̐gā
sesavĕṭṭināṁḍlabaim̐ jittamunnadā
yīsulega nīvu navveyībĕddarigame sālu
mosamuledu rāvayya mŏkkemu nīgu
(||||)
pŏṭṭabŏrugusadulu pŏṁchi sevaseyam̐gā
paṭṭabudevulamīm̐da bām̐ti vunnadā
aṭṭĕ śhrī veṁkaḍeśha alamelumaṁganu nenu
muṭṭi nannum̐ gūḍidivi mŏkkemu nīgu