Emduvoye vibudu iddara meduraidimi

ఎందువోయే విపుడు ఇద్దర మెదురైతిమి
Language

(॥పల్లవి॥)
ఎందువోయే విపుడు ఇద్దర మెదురైతిమి
కందువల మనగుట్టు కానవచ్చీ నిఁకను

(॥ఎందు॥)
చన్నులు నీ పైనాని సాదింతుఁగాక కత-
లెన్నిచెప్పినా నేను యేలమానేను
విన్నవినుకులకును వేతుఁగాక నీపై నింద
వన్నిననీయానలకు భ్రమసేనా ఇఁకను

(॥ఎందు॥)
పెదవితేనియ లాని పిప్పి సేతుఁగాక నవ్వు-
లెదుట నెంతనవ్వినా యేలమానేను
వుదుటునీయెమ్మెలకు వూఁదుదుఁగాక గోరు
చదురునీ సేఁతలకు జడిసేనా ఇఁకను

(॥ఎందు॥)
కూడినరతుల నాని కుమ్మరింతుఁగాక తమ్మ
యీడ నీ వెంతమొక్కినా యేలమానేను
పాడితో శ్రీవేంకటేశ పై కొంటివి మెత్తుఁగాక
ఆడుకోలు పంతాలకు నలసేనా ఇకను

(||pallavi||)
ĕṁduvoye vibuḍu iddara mĕduraidimi
kaṁduvala managuṭṭu kānavachchī nim̐kanu

(||ĕṁdu||)
sannulu nī paināni sādiṁtum̐gāga kada-
lĕnnisĕppinā nenu yelamānenu
vinnavinugulagunu vedum̐gāga nībai niṁda
vanninanīyānalagu bhramasenā im̐kanu

(||ĕṁdu||)
pĕdavideniya lāni pippi sedum̐gāga navvu-
lĕduḍa nĕṁtanavvinā yelamānenu
vuduḍunīyĕmmĕlagu vūm̐dudum̐gāga goru
sadurunī sem̐talagu jaḍisenā im̐kanu

(||ĕṁdu||)
kūḍinaradula nāni kummariṁtum̐gāga tamma
yīḍa nī vĕṁtamŏkkinā yelamānenu
pāḍido śhrīveṁkaḍeśha pai kŏṁṭivi mĕttum̐gāga
āḍugolu paṁtālagu nalasenā iganu