ఎందువోయే నే నీకు నెప్పుడుఁ గలదాననే
(॥పల్లవి॥)
ఎందువోయే నే నీకు నెప్పుడుఁ గలదాననే
గొంది వలపులు చల్లి కూడవయ్య ఆపెను
(॥ఎందు॥)
కాలుదొక్కి సేసవెట్టి కప్పురము నోటికిచ్చి
జాలిఁబడీ నాపె నీతో సారె సారెకు
ఆలకించ వింతటను ఆఁడుఁగొల నీకేల
కూళతనములు మాని కూడవయ్య ఆపెను
(॥ఎందు॥)
కొంగువట్టి కొప్పుదువ్వి గోరికొన దాఁకించి
అంగమిచ్చీ నాపె నిన్ను నంతా నింతాను
ఇంగితమేమి నెరఁగ వింతులగోడు నీకేల
గుంగిలి గేలిసేయక కూడవయ్య ఆపెను
(॥ఎందు॥)
నవ్వునవ్వి నమ్మికిచ్చి నయముల చవి చూపి
రవ్వసేసీ నాపె నిన్ను రారాఁపుల
యివ్వల శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను
కువ్వలుగా రతికేలిఁ గూడవయ్య ఆపెను
(||pallavi||)
ĕṁduvoye ne nīgu nĕppuḍum̐ galadānane
gŏṁdi valabulu salli kūḍavayya ābĕnu
(||ĕṁdu||)
kāludŏkki sesavĕṭṭi kappuramu noḍigichchi
jālim̐baḍī nābĕ nīdo sārĕ sārĕgu
ālagiṁcha viṁtaḍanu ām̐ḍum̐gŏla nīgela
kūḽadanamulu māni kūḍavayya ābĕnu
(||ĕṁdu||)
kŏṁguvaṭṭi kŏppuduvvi gorigŏna dām̐kiṁchi
aṁgamichchī nābĕ ninnu naṁtā niṁtānu
iṁgidamemi nĕram̐ga viṁtulagoḍu nīgela
guṁgili geliseyaga kūḍavayya ābĕnu
(||ĕṁdu||)
navvunavvi nammigichchi nayamula savi sūbi
ravvasesī nābĕ ninnu rārām̐pula
yivvala śhrī veṁkaḍeśha yĕnasidi viḍu nannu
kuvvalugā radigelim̐ gūḍavayya ābĕnu