Emdunum boraadu aadamdemi sesune

ఎందునుఁ బోరాదు ఆతఁడేమి సేసునే
Language

(॥పల్లవి॥)
ఎందునుఁ బోరాదు ఆతఁడేమి సేసునే
యిందునే విట్ఠలుని నీవెంత సేసేవే

(॥॥)
అంగన నీమాలెల్ల నాదరించి వినఁగానే
పంగించి యాతనికేదో పరాకనేవే
ముంగిటి నీమొక్కులెల్ల మొగి నెంచుకొనఁగానే
అంగవించి యెందో మాటలాడీ ననేవే

(॥॥)
నమ్మిక నీచేఁతలకు నవ్వులాతఁడు నవ్వఁగ
చిమ్మిరేఁగి అవి యేదో సిగ్గులనేవే
తమ్మిరేకుఁ గన్నులను తప్పకిట్టే చూడఁగాను
యిమ్ముల నవి గొన్ని యెమ్మెలనేవే

(॥॥)
గక్కన నాతడు నిన్నుఁ గాఁగిలించి కూడఁగాను
తక్కకెవ్వతెపైదో కాతరమనేవే
యిక్కువ శ్రీవేంకటేశుఁ డీతఁడే నిన్ను మెచ్చఁగ
చక్కఁగా నితఁడింతటి జాణఁడనేవే.

(||pallavi||)
ĕṁdunum̐ borādu ādam̐ḍemi sesune
yiṁdune viṭṭhaluni nīvĕṁta seseve

(||||)
aṁgana nīmālĕlla nādariṁchi vinam̐gāne
paṁgiṁchi yādanigedo parāganeve
muṁgiḍi nīmŏkkulĕlla mŏgi nĕṁchugŏnam̐gāne
aṁgaviṁchi yĕṁdo māḍalāḍī naneve

(||||)
nammiga nīsem̐talagu navvulādam̐ḍu navvam̐ga
simmirem̐gi avi yedo siggulaneve
tammiregum̐ gannulanu tappagiṭṭe sūḍam̐gānu
yimmula navi gŏnni yĕmmĕlaneve

(||||)
gakkana nādaḍu ninnum̐ gām̐giliṁchi kūḍam̐gānu
takkagĕvvadĕbaido kādaramaneve
yikkuva śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe ninnu mĕchcham̐ga
sakkam̐gā nidam̐ḍiṁtaḍi jāṇam̐ḍaneve.