Emdunum bomdani yedagaada mide yani

ఎందునుఁ బొందని యెడకాట మిదె యని
Language

(॥పల్లవి॥)
ఎందునుఁ బొందని యెడకాట మిదె యని
యిందిరనాథుని సేవించు మనసు

(॥ఎందు॥)
కూడితే సంసారము కొనకెక్కఁ జేయవలె
కూడకుండితే విరతి నెక్కుడు గావలె
తాడుపడి వొక్కఁడు తగు లేమి చేకూడితే
వాడీవాడని పైరువలె నవు మనసూ

(॥ఎందు॥)
వొండె యిమువాఁడై వున్నతి బ్రదుకవలె
వొండె పరముగోరే వుపమవలె
రెండు విడువలేక రీతులు వేరేయయితే
వండీవఁడని కూడువలె నవు మనసూ

(॥ఎందు॥)
తను నెఱుఁగగఁవలె తనలోన నే పొద్దు
యెనయ శ్రీ వేంకటేశు నెఱుఁగవలె
మనసు విలుపవలె మరి యెన్ని చదివినా
వనధిలోఁ గురిసిన వానవు మనసూ

(||pallavi||)
ĕṁdunum̐ bŏṁdani yĕḍagāḍa midĕ yani
yiṁdiranāthuni seviṁchu manasu

(||ĕṁdu||)
kūḍide saṁsāramu kŏnagĕkkam̐ jeyavalĕ
kūḍaguṁḍide viradi nĕkkuḍu gāvalĕ
tāḍubaḍi vŏkkam̐ḍu tagu lemi segūḍide
vāḍīvāḍani pairuvalĕ navu manasū

(||ĕṁdu||)
vŏṁḍĕ yimuvām̐ḍai vunnadi bradugavalĕ
vŏṁḍĕ paramugore vubamavalĕ
rĕṁḍu viḍuvalega rīdulu vereyayide
vaṁḍīvam̐ḍani kūḍuvalĕ navu manasū

(||ĕṁdu||)
tanu nĕṟum̐gagam̐valĕ tanalona ne pŏddu
yĕnaya śhrī veṁkaḍeśhu nĕṟum̐gavalĕ
manasu vilubavalĕ mari yĕnni sadivinā
vanadhilom̐ gurisina vānavu manasū