Emdumdi techchugomtivi yeebenu neevu

ఎందుండి తెచ్చుకొంటివి యీపెను నీవు
Language

(॥పల్లవి॥)
ఎందుండి తెచ్చుకొంటివి యీపెను నీవు
అందమాయఁ జేఁతలు నేఁడాపె నీకుఁ దగును

(॥ఎందు॥)
శిరసు వంచుకొంటా సిగ్గులు వడుకొంటా
సరసము లేమాడీ సతి నీతోను
సరులు దిద్దుకొంటా సారె నిన్నుఁ జూచుకొంటా
విరుల నేల వేసీ వేమరు నీపైని

(॥ఎందు॥)
పాటలు వాడుకొంటా పాపట దువ్వకొంటా
నీటులేమి చూపీని నెలఁత నీకు
మాటల సొలసుకొంటా మర్మము లంటుకొంటా
చీటికి మాటికినేల చెక్కులు నొక్కీని

(॥ఎందు॥)
చేతులెత్తి మొక్కుకొంటా చేరి కాఁగిలించుకొంటా
కాతరించి యెట్టుగూడీఁ గాంత నిన్ను
నీతితో శ్రీవేంకటేశ నేనలమేలుమంగను
యీతల నన్నేలి తీపె యిప్పుడె మెచ్చీని

(||pallavi||)
ĕṁduṁḍi tĕchchugŏṁṭivi yībĕnu nīvu
aṁdamāyam̐ jem̐talu nem̐ḍābĕ nīgum̐ dagunu

(||ĕṁdu||)
śhirasu vaṁchugŏṁṭā siggulu vaḍugŏṁṭā
sarasamu lemāḍī sadi nīdonu
sarulu diddugŏṁṭā sārĕ ninnum̐ jūsugŏṁṭā
virula nela vesī vemaru nībaini

(||ĕṁdu||)
pāḍalu vāḍugŏṁṭā pābaḍa duvvagŏṁṭā
nīḍulemi sūbīni nĕlam̐ta nīgu
māḍala sŏlasugŏṁṭā marmamu laṁṭugŏṁṭā
sīḍigi māḍiginela sĕkkulu nŏkkīni

(||ĕṁdu||)
sedulĕtti mŏkkugŏṁṭā seri kām̐giliṁchugŏṁṭā
kādariṁchi yĕṭṭugūḍīm̐ gāṁta ninnu
nīdido śhrīveṁkaḍeśha nenalamelumaṁganu
yīdala nanneli tībĕ yippuḍĕ mĕchchīni