Emdum dechchugomti veegemau neegu

ఎందుఁ దెచ్చుకొంటి వీకేమౌ నీకు
Language

(॥పల్లవి॥)
ఎందుఁ దెచ్చుకొంటి వీకేమౌ నీకు
సందుసుడిఁ దానేల సాదించవచ్చీని

(॥ఎందు॥)
నేనిన్ను సొలసితే నీకుఁ దాఁ బూనుకవచ్చీ
తానేమౌనౌకాని యీతరుణి
పూని నే నప్పటి నీపై పుప్పొడి చల్లితేను
ఆనుకొని సారెసారె నడ్డాలువచ్చీని

(॥ఎందు॥)
కూరిమితో నే నిన్నుఁ గొంగువట్టి తీసితేను
బీరానఁ దానేల విడిపించవచ్చీని
మేరమీరి నేనితో మేలమాడి చెనకితే
చేరి తానెంత గొణఁగి చేతులు చాఁచీని

(॥ఎందు॥)
నిలుచుండి వేడుకతో నిన్నునేఁ గాఁగిలించితే
సెలవి నవ్వి తానేమి సిగ్గువడీని
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
లలి నీవద్ద నే నుంటే లాఁచీఁ దాను నీకును

(||pallavi||)
ĕṁdum̐ dĕchchugŏṁṭi vīgemau nīgu
saṁdusuḍim̐ dānela sādiṁchavachchīni

(||ĕṁdu||)
neninnu sŏlaside nīgum̐ dām̐ būnugavachchī
tānemaunaugāni yīdaruṇi
pūni ne nappaḍi nībai puppŏḍi sallidenu
ānugŏni sārĕsārĕ naḍḍāluvachchīni

(||ĕṁdu||)
kūrimido ne ninnum̐ gŏṁguvaṭṭi tīsidenu
bīrānam̐ dānela viḍibiṁchavachchīni
meramīri nenido melamāḍi sĕnagide
seri tānĕṁta gŏṇam̐gi sedulu sām̐sīni

(||ĕṁdu||)
nilusuṁḍi veḍugado ninnunem̐ gām̐giliṁchide
sĕlavi navvi tānemi sigguvaḍīni
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
lali nīvadda ne nuṁṭe lām̐sīm̐ dānu nīgunu