Emdulonidaananu yippuditte vachchem daanu

ఎందులోనిదానను యిప్పుడిట్టె వచ్చెఁ దాను
Language

(॥పల్లవి॥)
ఎందులోనిదానను యిప్పుడిట్టె వచ్చెఁ దాను
సందడి సరసముల జాణకాఁడు దాను

(॥ఎందు॥)
పవ్వళించి విరహాన బడలి వుండేదానఁ
నెవ్వరితోడి మాట లేఁటికి నాకు
నవ్వితేఁ దానవ్వనీ నా సెలవులకు రావు
అవ్వల వేడుకకాఁడు అన్నిటాను తాను

(॥ఎందు॥)
అచ్చలాన వేగించి అలసి వుండినదాన
యిచ్చకపు మొక్కు మొక్కనేఁటికి నాకు
హెచ్చి తా సంతోషించితే యింపు నామతిఁబుట్టదు
పచ్చిసింగారాలతోడి పంతగాఁడు తాను

(॥ఎందు॥)
తనకాఁగిటనె కూడి దక్కివుండినట్టిదాన
యెనలేని మెచ్చు మెచ్చనేఁటికి నాకు
యెనసె శ్రీ వేంకటేశుఁ డింతకంటె నేమి సేతు
మనసిచ్చి అందరికి మంచివాఁడు దాను

(||pallavi||)
ĕṁdulonidānanu yippuḍiṭṭĕ vachchĕm̐ dānu
saṁdaḍi sarasamula jāṇagām̐ḍu dānu

(||ĕṁdu||)
pavvaḽiṁchi virahāna baḍali vuṁḍedānam̐
nĕvvaridoḍi māḍa lem̐ṭigi nāgu
navvidem̐ dānavvanī nā sĕlavulagu rāvu
avvala veḍugagām̐ḍu anniḍānu tānu

(||ĕṁdu||)
achchalāna vegiṁchi alasi vuṁḍinadāna
yichchagabu mŏkku mŏkkanem̐ṭigi nāgu
hĕchchi tā saṁtoṣhiṁchide yiṁpu nāmadim̐buṭṭadu
pachchisiṁgārāladoḍi paṁtagām̐ḍu tānu

(||ĕṁdu||)
tanagām̐giḍanĕ kūḍi dakkivuṁḍinaṭṭidāna
yĕnaleni mĕchchu mĕchchanem̐ṭigi nāgu
yĕnasĕ śhrī veṁkaḍeśhum̐ ḍiṁtagaṁṭĕ nemi sedu
manasichchi aṁdarigi maṁchivām̐ḍu dānu