Emdugu royanivaamda vemainaam jeyavachchevu

ఎందుకు రోయనివాఁడ వేమైనాఁ జేయవచ్చేవు
Language

(॥పల్లవి॥)
ఎందుకు రోయనివాఁడ వేమైనాఁ జేయవచ్చేవు
విందువలె వింతవారు వింటే నవ్వేరయ్యా

(॥ఎందు॥)
వుంగిటిగా నెవ్వతో నీవురమున మెత్తినట్టి -
యెంగిలిగందాలు నాపైనేల పూసేవు
పంగెము గలవాఁడవు బాఁతిపడుదువు గాక
సంగతా ఇల్లాండ్లకు సర విది యౌనా

(॥ఎందు॥)
అమరించి యేడవారో అట్టే నీకు నిచ్చినట్టి
చెమటసొమ్ములు నాచేతఁ బెట్టేవు
తమిగలవాఁడవు తగిలించుకొని వచ్చి
గుమితాన నుండేమాకు గురిగా నిచ్చితివి

(॥ఎందు॥)
మానినులరతులను మాఁగినచేతులఁ దెచ్చి
కానుక వట్టుచు నన్ను గాఁగిలించేవు
కానీలే శ్రీ వేంకటేశ కలసితివి వలపు
నానఁబెట్టి నీకుఁ దగు నాలి నాకుఁ దగునా

(||pallavi||)
ĕṁdugu royanivām̐ḍa vemainām̐ jeyavachchevu
viṁduvalĕ viṁtavāru viṁṭe navverayyā

(||ĕṁdu||)
vuṁgiḍigā nĕvvado nīvuramuna mĕttinaṭṭi -
yĕṁgiligaṁdālu nābainela pūsevu
paṁgĕmu galavām̐ḍavu bām̐tibaḍuduvu gāga
saṁgadā illāṁḍlagu sara vidi yaunā

(||ĕṁdu||)
amariṁchi yeḍavāro aṭṭe nīgu nichchinaṭṭi
sĕmaḍasŏmmulu nāsedam̐ bĕṭṭevu
tamigalavām̐ḍavu tagiliṁchugŏni vachchi
gumidāna nuṁḍemāgu gurigā nichchidivi

(||ĕṁdu||)
māninularadulanu mām̐ginasedulam̐ dĕchchi
kānuga vaṭṭusu nannu gām̐giliṁchevu
kānīle śhrī veṁkaḍeśha kalasidivi valabu
nānam̐bĕṭṭi nīgum̐ dagu nāli nāgum̐ dagunā