ఎందుకు రోయ విదేరా యెంతపాపము
(॥పల్లవి॥)
ఎందుకు రోయ విదేరా యెంతపాపము
ఇందరిచేతా వింటి యీ పాపము
(॥ఎందు॥)
వూరకున్నయాఁట దాని నొక్కొక్క ఆసరేఁచి
ఆరయఁ బరాకుసేయు టది పాపము
చేరువ నుండినదానిఁ జేకొన కప్పటిని
కోరి వేరేసతిఁ దెచ్చుకొంట గడుఁబాపము
(॥ఎందు॥)
కలయనిముద్దరాలిఁ గన్నెరికము చేకొని
అలరుచు సిగ్గువడే దది పాపము
వలచినవా రుండఁగ వాడవారివెంటవెంట
మెలఁగి తిరిగాడేది మిక్కిలిఁ బావము
(॥ఎందు॥)
వొప్పగుపట్టపు దేవి నురమునఁ బెట్టుకొని
అప్పటి దిక్కులు చూచే దది పాపము
యిప్పుడె శ్రీ వేంకటేశ యీడ నన్నుఁ గూడితివి
యెప్పటి కెప్పటిసుద్దు లేఁటిపాపము
(||pallavi||)
ĕṁdugu roya viderā yĕṁtabābamu
iṁdarisedā viṁṭi yī pābamu
(||ĕṁdu||)
vūragunnayām̐ṭa dāni nŏkkŏkka āsarem̐si
ārayam̐ barāguseyu ṭadi pābamu
seruva nuṁḍinadānim̐ jegŏna kappaḍini
kori veresadim̐ dĕchchugŏṁṭa gaḍum̐bābamu
(||ĕṁdu||)
kalayanimuddarālim̐ gannĕrigamu segŏni
alarusu sigguvaḍe dadi pābamu
valasinavā ruṁḍam̐ga vāḍavārivĕṁṭavĕṁṭa
mĕlam̐gi tirigāḍedi mikkilim̐ bāvamu
(||ĕṁdu||)
vŏppagubaṭṭabu devi nuramunam̐ bĕṭṭugŏni
appaḍi dikkulu sūse dadi pābamu
yippuḍĕ śhrī veṁkaḍeśha yīḍa nannum̐ gūḍidivi
yĕppaḍi kĕppaḍisuddu lem̐ṭibābamu