Emdugani simtimtu nemi sedunu

ఎందుకని చింతింతు నేమి సేతును
Language

(॥పల్లవి॥)
ఎందుకని చింతింతు నేమి సేతును
కందువ నీ మహిమకుఁ గడపల లేదు

(॥ఎందు॥)
మనసులో కోపము మాటలలోపల లేదు
మొనసి యింతటిలో నీమోము చూచితే
పెనగొన్నకోరికలు బిగువుచూపఁగనీదు
తనివోనినీమంచితన మెంచితేను

(॥ఎందు॥)
చేతులలో చల్లఁగాఁక నెలవినవ్వుల లేదు
నీతో సరసములు నేనాడితే
ఘాతఁ గొనగోరివాఁడి కాయముపై నాఁటదు
యీతల నీనాసంది ఇంపు లెంచితేను

(॥ఎందు॥)
జంకెలకారాలు మోవిచవులలోపల లేవు
కంకిగా నిన్ను రతులఁ గాఁగిలించితే
అంకెల శ్రీవేంకటేశ అన్నిటాఁ గూడితి మిదె
కొంకులేనిమనలోనిగుణా లెంచితేను

(||pallavi||)
ĕṁdugani siṁtiṁtu nemi sedunu
kaṁduva nī mahimagum̐ gaḍabala ledu

(||ĕṁdu||)
manasulo kobamu māḍalalobala ledu
mŏnasi yiṁtaḍilo nīmomu sūside
pĕnagŏnnagorigalu biguvusūbam̐ganīdu
tanivoninīmaṁchidana mĕṁchidenu

(||ĕṁdu||)
sedulalo sallam̐gām̐ka nĕlavinavvula ledu
nīdo sarasamulu nenāḍide
ghādam̐ gŏnagorivām̐ḍi kāyamubai nām̐ṭadu
yīdala nīnāsaṁdi iṁpu lĕṁchidenu

(||ĕṁdu||)
jaṁkĕlagārālu movisavulalobala levu
kaṁkigā ninnu radulam̐ gām̐giliṁchide
aṁkĕla śhrīveṁkaḍeśha anniḍām̐ gūḍidi midĕ
kŏṁkulenimanaloniguṇā lĕṁchidenu