ఎఁదుకని సిగ్గువడే వేమే నీవు
(॥పల్లవి॥)
ఎఁదుకని సిగ్గువడే వేమే నీవు
కందువ నా పచ్చడము గప్పుకోవే యిపుడు
(॥॥)
ముదిత జారినకొప్పు ముడుచుకోఁగడఁగితే
వదలి పయ్యద కానవచ్చెఁ జన్నులు
అది చక్కబెట్టుకొనేనంటాఁ గొంగు బిగించితే
పొదిగి కట్టిన యట్టి పోఁకముడి వీడెను
(॥॥)
సరుగ నావలిపెమే చక్కఁగట్టు కొనఁగాను
గరిమఁ దొడలనిగ్గు గానవచ్చేను
పరగ నందుకు లోఁగి పాపట దువ్వుకొంటే
కరమూలములసొంపు గడుబయలాయను
(॥॥)
చెలరేఁగి యందుకు నవ్వి చేత విడెమిచ్చి తేను
పులకలే నీమర్మములు దెలిపె
అలమితి నందుకుఁగా నట్టె శ్రీవేంకటేశుఁడ
చెలపలచెమటలు చెమరించె నీకును
(||pallavi||)
ĕm̐dugani sigguvaḍe veme nīvu
kaṁduva nā pachchaḍamu gappugove yibuḍu
(||||)
mudida jārinagŏppu muḍusugom̐gaḍam̐gide
vadali payyada kānavachchĕm̐ jannulu
adi sakkabĕṭṭugŏnenaṁṭām̐ gŏṁgu bigiṁchide
pŏdigi kaṭṭina yaṭṭi pom̐kamuḍi vīḍĕnu
(||||)
saruga nāvalibĕme sakkam̐gaṭṭu kŏnam̐gānu
garimam̐ dŏḍalaniggu gānavachchenu
paraga naṁdugu lom̐gi pābaḍa duvvugŏṁṭe
karamūlamulasŏṁpu gaḍubayalāyanu
(||||)
sĕlarem̐gi yaṁdugu navvi seda viḍĕmichchi tenu
pulagale nīmarmamulu dĕlibĕ
alamidi naṁdugum̐gā naṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍa
sĕlabalasĕmaḍalu sĕmariṁchĕ nīgunu