ఎందుకైనా నోపుదువు యేల బింకాలాడేవు
(॥పల్లవి॥)
ఎందుకైనా నోపుదువు యేల బింకాలాడేవు
మందలించి చెనకితే మానుమనేవా
(॥ఎందు॥)
పాలుగలయాకె నీతో పంతములే యాడెఁగాని
కాలు దాఁకించితే నీవు కాదనేవా
చేలకొంగు వట్టి నిన్ను సిగ్గులే పరచెఁగాని
వాలాఇంచి పెనఁగితే వద్దనేవా
(॥ఎందు॥)
తగవెఱిగినయాపె తప్పక చూచెఁగాని
వొగి నొట్టువెట్టితే నోపననేవా
అగపడి యప్పటిని ఆయములే ముట్టెఁగాని
తగిలి కొప్పువట్టితే తగదనేవా
(॥ఎందు॥)
గక్కన గూడి యాపె కప్పురమె ఇచ్చెఁగాని
వొక్కటై విడెమిచ్చితే వొల్లననేనా
వుక్కున శ్రీవేంకటేశ వూరకె జంకించెఁగాని
వెక్కసాలేమియాడినా వినననేవా
(||pallavi||)
ĕṁdugainā nobuduvu yela biṁkālāḍevu
maṁdaliṁchi sĕnagide mānumanevā
(||ĕṁdu||)
pālugalayāgĕ nīdo paṁtamule yāḍĕm̐gāni
kālu dām̐kiṁchide nīvu kādanevā
selagŏṁgu vaṭṭi ninnu siggule parasĕm̐gāni
vālāiṁchi pĕnam̐gide vaddanevā
(||ĕṁdu||)
tagavĕṟiginayābĕ tappaga sūsĕm̐gāni
vŏgi nŏṭṭuvĕṭṭide nobananevā
agabaḍi yappaḍini āyamule muṭṭĕm̐gāni
tagili kŏppuvaṭṭide tagadanevā
(||ĕṁdu||)
gakkana gūḍi yābĕ kappuramĕ ichchĕm̐gāni
vŏkkaḍai viḍĕmichchide vŏllananenā
vukkuna śhrīveṁkaḍeśha vūragĕ jaṁkiṁchĕm̐gāni
vĕkkasālemiyāḍinā vinananevā