Emdu voyye vamdugemi yemi dappe nimtalone

ఎందు వొయ్యే వందుకేమి యేమి దప్పె నింతలోనె
Language

(॥పల్లవి॥)
ఎందు వొయ్యే వందుకేమి యేమి దప్పె నింతలోనె
కందువ నీ సరితలు కనుకొనేరా

(॥ఎందు॥)
చెక్కు నొక్కినంతలోనె చెల్లఁబో కోపగించేవు
తక్కక నాకొనగోరు తాఁకెనంటాను
కక్కసించి నీమేను గాజున గీరితే నీకు
దిక్కు వచ్చేదెవ్వతో నేఁ దెలిసేరా యిఁకను

(॥ఎందు॥)
ముద్దు వెట్టినంతలోనె మొక్కలానఁ బగ చాటి
అద్దలించేవు నాయెంగిలంటెనంటాను
వుద్దండాన నా తమ్ములమోరి నీ నోరనిడితే
పెద్దరికము చూచేరా బీరపు నిన్నపుడు

(॥ఎందు॥)
అట్టె కాఁగిలించుకొంటే నానలువెట్టి వచ్చేవు
వొట్టుక నాగుబ్బలు నిన్నొత్తెనంటాను
నెట్ట శ్రీవేంకటేశ నీవె నన్నుఁ కూడితివి
తొట్టిన నీమదమెల్లా తుదకెక్కించేరా

(||pallavi||)
ĕṁdu vŏyye vaṁdugemi yemi dappĕ niṁtalonĕ
kaṁduva nī saridalu kanugŏnerā

(||ĕṁdu||)
sĕkku nŏkkinaṁtalonĕ sĕllam̐bo kobagiṁchevu
takkaga nāgŏnagoru tām̐kĕnaṁṭānu
kakkasiṁchi nīmenu gājuna gīride nīgu
dikku vachchedĕvvado nem̐ dĕliserā yim̐kanu

(||ĕṁdu||)
muddu vĕṭṭinaṁtalonĕ mŏkkalānam̐ baga sāḍi
addaliṁchevu nāyĕṁgilaṁṭĕnaṁṭānu
vuddaṁḍāna nā tammulamori nī noraniḍide
pĕddarigamu sūserā bīrabu ninnabuḍu

(||ĕṁdu||)
aṭṭĕ kām̐giliṁchugŏṁṭe nānaluvĕṭṭi vachchevu
vŏṭṭuga nāgubbalu ninnŏttĕnaṁṭānu
nĕṭṭa śhrīveṁkaḍeśha nīvĕ nannum̐ kūḍidivi
tŏṭṭina nīmadamĕllā tudagĕkkiṁcherā