Emdu voyye mimkanoo yerimgemu gaaga ninnu

ఎందు వొయ్యే మిఁకనూ యెరిఁగేము గాక నిన్ను
Language

(॥పల్లవి॥)
ఎందు వొయ్యే మిఁకనూ యెరిఁగేము గాక నిన్ను
కందువలనె తెలిపేఁ గానీవయ్య యిపుడు

(॥ఎందు॥)
యింతుల తిట్లకును యెగ్గు వట్టెవారె కాక
సంతసించి నవ్వు నవ్వేజాణ లెవ్వరు
అంతలోనే నని వచ్చే వాయము సోఁక నాడి
పంత మెల్లఁ గనుకొనే పదవయ్య లోనికి

(॥ఎందు॥)
కొమ్మల సణఁగులకు గోర సేసేవారె కాక
సమ్మతించి మెచ్చు మెచ్చేజాణ లెవ్వరు
కమ్మర దీకోనేవు నీకడమ లెల్లాఁ బాపి
నమ్మి నీవోపిక చూచేఁ బదవయ్య లోనికి

(॥ఎందు॥)
మగువల మేకులకు మట్టుపడేవారె కాక
జగములోఁగా దనేటిజాణ లెవ్వరు
నిగిడి శ్రీవెంకటేశ నిన్ను నేనె కూడితిని
పగటు లేరుపరచేఁ బదవయ్య లోనికి

(||pallavi||)
ĕṁdu vŏyye mim̐kanū yĕrim̐gemu gāga ninnu
kaṁduvalanĕ tĕlibem̐ gānīvayya yibuḍu

(||ĕṁdu||)
yiṁtula tiṭlagunu yĕggu vaṭṭĕvārĕ kāga
saṁtasiṁchi navvu navvejāṇa lĕvvaru
aṁtalone nani vachche vāyamu som̐ka nāḍi
paṁta mĕllam̐ ganugŏne padavayya lonigi

(||ĕṁdu||)
kŏmmala saṇam̐gulagu gora sesevārĕ kāga
sammadiṁchi mĕchchu mĕchchejāṇa lĕvvaru
kammara dīgonevu nīgaḍama lĕllām̐ bābi
nammi nīvobiga sūsem̐ badavayya lonigi

(||ĕṁdu||)
maguvala megulagu maṭṭubaḍevārĕ kāga
jagamulom̐gā daneḍijāṇa lĕvvaru
nigiḍi śhrīvĕṁkaḍeśha ninnu nenĕ kūḍidini
pagaḍu lerubarasem̐ badavayya lonigi