Emdu voyee nadamdu yemane nenu

ఎందు వోయీ నతఁడు యేమనే నేను
Language

(॥పల్లవి॥)
ఎందు వోయీ నతఁడు యేమనే నేను
చందమాయఁ బనులెల్ల చలమేలే ఇఁకను

(॥ఎందు॥)
తమకమెల్లాఁ గంటి తలఁ పెల్లా నీడేరె
రమణుఁ డన్నీ నెఱుఁగు రావే నీవు
కొమరె వయసుగాన కోడెకాఁడన్నిటా దాను
విమలమాయ మనసు విడువవే చెఱఁగు

(॥ఎందు॥)
యీయకొంటిఁ దనసుద్దు లిందరు దన్ను మెచ్చిరి
రాయడించ కాతనిని రావే నీవు
చాయల నడతు నేను సరసుఁడిన్నిటాఁదాను
బాయట నందరుఁ జూడ పట్టకునే ఇఁకను

(॥ఎందు॥)
మతక మిందులో నేదే మచ్చికలు దైవారె
రతుల నన్నిటాఁ గూడె రావే నీవు
తతి శ్రీ వేంకటేశుఁడు తాను యీతని ఇంతిని
కత లీతనిప్రియాలు కైకొనఁగరాదా

(||pallavi||)
ĕṁdu voyī nadam̐ḍu yemane nenu
saṁdamāyam̐ banulĕlla salamele im̐kanu

(||ĕṁdu||)
tamagamĕllām̐ gaṁṭi talam̐ pĕllā nīḍerĕ
ramaṇum̐ ḍannī nĕṟum̐gu rāve nīvu
kŏmarĕ vayasugāna koḍĕgām̐ḍanniḍā dānu
vimalamāya manasu viḍuvave sĕṟam̐gu

(||ĕṁdu||)
yīyagŏṁṭim̐ danasuddu liṁdaru dannu mĕchchiri
rāyaḍiṁcha kādanini rāve nīvu
sāyala naḍadu nenu sarasum̐ḍinniḍām̐dānu
bāyaḍa naṁdarum̐ jūḍa paṭṭagune im̐kanu

(||ĕṁdu||)
madaga miṁdulo nede machchigalu daivārĕ
radula nanniḍām̐ gūḍĕ rāve nīvu
tadi śhrī veṁkaḍeśhum̐ḍu tānu yīdani iṁtini
kada līdanipriyālu kaigŏnam̐garādā