ఎందు వోయీ మన బత్తి యెప్పుడునుఁ గలదె
(॥పల్లవి॥)
ఎందు వోయీ మన బత్తి యెప్పుడునుఁ గలదె
వొందిలిఁ గొంత దడవు వూరకుండఁ గదవే
(॥ఎందు॥)
చనువుగల్గుకాంత జంకిచి పతిఁ దిట్టితే
గునిసి నీవేల ఆపెఁ గోపగించేవే
వనజాక్షి! తలపోయ వారువారు నొక్కటే
వొసర నన్నీఁ జూతము వూరుండఁగదవే
(॥ఎందు॥)
బాసలుకొన్నకామిని పైకొని పెనఁగితేను
యీసుతోడ నడ్డాలు నీవేల వచ్చేవే
ఆసల నిద్దరికిని అన్నీ సమ్మతులే
వోసరించి తెలుతము వూరకుండఁగదవే
(॥ఎందు॥)
సిగ్గులు విడిచినాపె శ్రీవేంకటేశుఁ గూడితే
యెగ్గులు వట్టుచు నీవేల నవ్వేవే
తగ్గుమొగ్గు లేమీ లేవు తమలోన నింపులే
వొగ్గి మనములాఁ గూడె నూరకుండఁగదవే
(||pallavi||)
ĕṁdu voyī mana batti yĕppuḍunum̐ galadĕ
vŏṁdilim̐ gŏṁta daḍavu vūraguṁḍam̐ gadave
(||ĕṁdu||)
sanuvugalgugāṁta jaṁkisi padim̐ diṭṭide
gunisi nīvela ābĕm̐ gobagiṁcheve
vanajākṣhi! talaboya vāruvāru nŏkkaḍe
vŏsara nannīm̐ jūdamu vūruṁḍam̐gadave
(||ĕṁdu||)
bāsalugŏnnagāmini paigŏni pĕnam̐gidenu
yīsudoḍa naḍḍālu nīvela vachcheve
āsala niddarigini annī sammadule
vosariṁchi tĕludamu vūraguṁḍam̐gadave
(||ĕṁdu||)
siggulu viḍisinābĕ śhrīveṁkaḍeśhum̐ gūḍide
yĕggulu vaṭṭusu nīvela navveve
taggumŏggu lemī levu tamalona niṁpule
vŏggi manamulām̐ gūḍĕ nūraguṁḍam̐gadave