ఎందు వోయీ మా పొందు లెప్పుడు మీ వారమే
(॥పల్లవి॥)
ఎందు వోయీ మా పొందు లెప్పుడు మీ వారమే
ఇందరిలో నాపె నీపై యేఁకటతో నున్నది
(॥॥)
ఆడరాదా మాటలు ఆపెతోడఁ గొంతవడి
వేడుకతో నున్నది వినేనంటాను
చూడరాదా నెమ్మోము సూటిగా నీయెదుఁటను
వీడెము చేతఁబుట్టుక వేళగాచుకున్నది
(॥॥)
చుట్టరికమైనాఁ గొంత చూపరాదా నీమీఁద
రెట్టించినరతులకోరిక నున్నది
ముట్టరాదా చనుఁగవ ముచ్చటైనతమితోడ
యెట్టయెదుట నీకేమిఁదెత్తుక తానున్నది
(॥॥)
కూచుండరాదా దండ గొబ్బున మంచముమీఁద
లాచి కూడినమందెమేళాన నున్నది
యేచి యిట్టె శ్రీవేంకటేశ నన్ను నేలితివి
చేచేత నిద్దరిఁ జూచి చేరి నవ్వుచున్నది
(||pallavi||)
ĕṁdu voyī mā pŏṁdu lĕppuḍu mī vārame
iṁdarilo nābĕ nībai yem̐kaḍado nunnadi
(||||)
āḍarādā māḍalu ābĕdoḍam̐ gŏṁtavaḍi
veḍugado nunnadi vinenaṁṭānu
sūḍarādā nĕmmomu sūḍigā nīyĕdum̐ṭanu
vīḍĕmu sedam̐buṭṭuga veḽagāsugunnadi
(||||)
suṭṭarigamainām̐ gŏṁta sūbarādā nīmīm̐da
rĕṭṭiṁchinaradulagoriga nunnadi
muṭṭarādā sanum̐gava muchchaḍainadamidoḍa
yĕṭṭayĕduḍa nīgemim̐dĕttuga tānunnadi
(||||)
kūsuṁḍarādā daṁḍa gŏbbuna maṁchamumīm̐da
lāsi kūḍinamaṁdĕmeḽāna nunnadi
yesi yiṭṭĕ śhrīveṁkaḍeśha nannu nelidivi
seseda niddarim̐ jūsi seri navvusunnadi