ఎందు వోయే విఁకను యిన్నియుఁ గనేము గాక
(॥పల్లవి॥)
ఎందు వోయే విఁకను యిన్నియుఁ గనేము గాక
కందువలు మాపటికిఁ గానవచ్చీఁ గాక
(॥ఎందు॥)
నవ్వు నవ్వ నేఁటికి నాతో నంతే కలితేను
చివ్వన మాయింటిక విచ్చేతువు గాక
పువ్వుల వేయ నేఁటికి పూఁపు నీకుఁ గలిగితే
సువ్వి యని రతులలోఁ జూపుదువు గాక
(॥ఎందు॥)
ఆన వెట్టి నేఁటికి ఆయములు సోఁకితేను
సోనల మాచేఁతలలో జూచేవు గాక
కానిమ్మన నేఁటికి గర్వములే చెల్లితేను
మేను మేను నొరసితే మెచ్చేవు గాక
(॥ఎందు॥)
పంత మాడ నేఁటికి బలిమి గలిగితేను
పొంత నాకాఁగిటిలోనఁ బొందుదు గాక
యింతలో శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను
మంతనాన సంతసించి మన్నింతువు గాక
(||pallavi||)
ĕṁdu voye vim̐kanu yinniyum̐ ganemu gāga
kaṁduvalu mābaḍigim̐ gānavachchīm̐ gāga
(||ĕṁdu||)
navvu navva nem̐ṭigi nādo naṁte kalidenu
sivvana māyiṁṭiga vichcheduvu gāga
puvvula veya nem̐ṭigi pūm̐pu nīgum̐ galigide
suvvi yani radulalom̐ jūbuduvu gāga
(||ĕṁdu||)
āna vĕṭṭi nem̐ṭigi āyamulu som̐kidenu
sonala māsem̐talalo jūsevu gāga
kānimmana nem̐ṭigi garvamule sĕllidenu
menu menu nŏraside mĕchchevu gāga
(||ĕṁdu||)
paṁta māḍa nem̐ṭigi balimi galigidenu
pŏṁta nāgām̐giḍilonam̐ bŏṁdudu gāga
yiṁtalo śhrī veṁkaḍeśha yĕnasidi viḍu nannu
maṁtanāna saṁtasiṁchi manniṁtuvu gāga