ఎందు వోయే నేను ఇక్కడనే వున్నదాన
(॥పల్లవి॥)
ఎందు వోయే నేను ఇక్కడనే వున్నదాన
అందుకోలు వలపులు అనుచరించరాదా
(॥ఎందు॥)
ముప్పిరి మాతోనీవు ముచ్చటలాడవచ్చేవు
కప్పురమిచ్చినయాపె కాచుకుండగా
అప్పటి వచ్చినపని అడుగరాదా ఆపెను
చిప్పిల వెనక నన్నుఁ జెనకేవుగాని
(॥ఎందు॥)
సారెకు నాతో నేమిచదురంగాలాడేవు
కోరివచ్చినాపె వొద్దఁ గూచుండఁగా
సైరణతో నీ వాపెచనవు చెల్లించరాదా
గారవించి మరి నన్నుఁ గుదిసేవుగాని
(॥ఎందు॥)
కందువతో నన్ను నెంత కాఁగిలించుకొనే విటె
సందడిఁ బెండ్లాడి నాపె సన్న సేయఁగా
వొందిలి యాపెను నీవు వొడఁబరచఁగరాదా
ఇందు శ్రీవేంకటేశ నన్నెననేవు గాని
(||pallavi||)
ĕṁdu voye nenu ikkaḍane vunnadāna
aṁdugolu valabulu anusariṁcharādā
(||ĕṁdu||)
muppiri mādonīvu muchchaḍalāḍavachchevu
kappuramichchinayābĕ kāsuguṁḍagā
appaḍi vachchinabani aḍugarādā ābĕnu
sippila vĕnaga nannum̐ jĕnagevugāni
(||ĕṁdu||)
sārĕgu nādo nemisaduraṁgālāḍevu
korivachchinābĕ vŏddam̐ gūsuṁḍam̐gā
sairaṇado nī vābĕsanavu sĕlliṁcharādā
gāraviṁchi mari nannum̐ gudisevugāni
(||ĕṁdu||)
kaṁduvado nannu nĕṁta kām̐giliṁchugŏne viḍĕ
saṁdaḍim̐ bĕṁḍlāḍi nābĕ sanna seyam̐gā
vŏṁdili yābĕnu nīvu vŏḍam̐barasam̐garādā
iṁdu śhrīveṁkaḍeśha nannĕnanevu gāni