Emdu nerusugoneno yeebe dikku soodavoyee

ఎందు నేరుచుకొనెనో యీపె దిక్కు చూడవోయీ
Language

(॥పల్లవి॥)
ఎందు నేరుచుకొనెనో యీపె దిక్కు చూడవోయీ
సందడిలో నీకు మోవి చవిచూపీని

(॥ఎందు॥)
వలపులు చల్లుకొంటా వనిత యేమౌనొకాని
మలసి సొలసి నీతో మాటలాడీని
బలిమిఁ బెనఁగుకొంటా పనిగలదానివలె
పిలిచిపిలిచి నీకు బ్రియముచెప్పీని

(॥ఎందు॥)
యెమ్మెలు నెరపుకొంటా నెందుండి వచ్చెనోకాని
చెమ్మఁ జెమ్మటతో నీపైఁ జేయి చాఁచీని
బొమ్మలారుచుకొంటాను పొఁదైనచుట్టమువలె
పమ్మి వద్దఁగూచుండి పాదాలొత్తిని

(॥ఎందు॥)
సారెసారె నవ్వుకొంటా చన వెంతగద్దోకాని
కూరిమితోఁ గాఁగిటఁ గూడీ నిన్ను
యీరీతి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
చేరి నన్నేలితివి తా సిగ్గుతో మొక్కిని

(||pallavi||)
ĕṁdu nerusugŏnĕno yībĕ dikku sūḍavoyī
saṁdaḍilo nīgu movi savisūbīni

(||ĕṁdu||)
valabulu sallugŏṁṭā vanida yemaunŏgāni
malasi sŏlasi nīdo māḍalāḍīni
balimim̐ bĕnam̐gugŏṁṭā panigaladānivalĕ
pilisibilisi nīgu briyamusĕppīni

(||ĕṁdu||)
yĕmmĕlu nĕrabugŏṁṭā nĕṁduṁḍi vachchĕnogāni
sĕmmam̐ jĕmmaḍado nībaim̐ jeyi sām̐sīni
bŏmmalārusugŏṁṭānu pŏm̐dainasuṭṭamuvalĕ
pammi vaddam̐gūsuṁḍi pādālŏttini

(||ĕṁdu||)
sārĕsārĕ navvugŏṁṭā sana vĕṁtagaddogāni
kūrimidom̐ gām̐giḍam̐ gūḍī ninnu
yīrīdi śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
seri nannelidivi tā siggudo mŏkkini