Emdu kemdu bolise vidi yedide

ఎందు కెందు బోలిచే విది యేటిదే
Language

(॥పల్లవి॥)
ఎందు కెందు బోలిచే విది యేటిదే
కందు వొక్క మేతకేరా కడివెఁడు గూటికి

(॥ఎందు॥)
యేకిటి నే నవ్వినను యేల నవ్వేవే అల్ల
నాటి హిరణ్యాక్షుతో నవ్వరా పోయి
మాటాడిననాతోడ మాటాడ వేమే నీ
మాటల సురతులు మరిగిరి చాలదా

(॥ఎందు॥)
యేపున నేఁ జూచినా నీ వేల చూడవే కొలనిలో
చూపట్టు గొల్లెతలనే చూడరా పోయి
తేపల నే మొక్కినా దీవించ వేమే వొరినీ
తీపు శిశుపాలు తిట్లే దీవెనలు గావా

(॥ఎందు॥)
అలమేల్మంగవు నీ వేదుగదే వోరి నీవు
బలిమి శ్రీవేంకటపతివి గావా
కొలఁది మిగుల నన్నుఁ గూడితిగదె నాపై
కులుకుమన్నన లిట్టే కూటములు గావా

(||pallavi||)
ĕṁdu kĕṁdu bolise vidi yeḍide
kaṁdu vŏkka medagerā kaḍivĕm̐ḍu gūḍigi

(||ĕṁdu||)
yegiḍi ne navvinanu yela navveve alla
nāḍi hiraṇyākṣhudo navvarā poyi
māḍāḍinanādoḍa māḍāḍa veme nī
māḍala suradulu marigiri sāladā

(||ĕṁdu||)
yebuna nem̐ jūsinā nī vela sūḍave kŏlanilo
sūbaṭṭu gŏllĕdalane sūḍarā poyi
tebala ne mŏkkinā dīviṁcha veme vŏrinī
tību śhiśhubālu tiṭle dīvĕnalu gāvā

(||ĕṁdu||)
alamelmaṁgavu nī vedugade vori nīvu
balimi śhrīveṁkaḍabadivi gāvā
kŏlam̐di migula nannum̐ gūḍidigadĕ nābai
kulugumannana liṭṭe kūḍamulu gāvā