ఎందు కైన వచ్చు నీ యిటువంటి భావములు
(॥పల్లవి॥)
ఎందు కైన వచ్చు నీ యిటువంటి భావములు
విందుగా నాతో నాడవే వింటా నున్నాఁ డాతడు
(॥ఎందుకైన॥)
చెక్కునఁ బెట్టేవు చేయి సిగ్గుకో చింతకో కాని
తక్కక నేపతిసుద్ది దడవితేను
పక్కన నవ్వే వందుకు పగటో నీ పల్లదమో
వొక్కమాటె ఆన తేవే వొద నున్నాఁ డాతఁడు
(॥ఎందు కైన॥)
తప్పక చూచే వదేమే తగలమో కోపమో
చిప్పిల నాతని నీ చేతి కియ్యఁగా
కుప్పేవు పయ్యదకొంగు కసరులో కొసరులో
వొప్పుగా నాకుఁ జెప్పవే వూరకున్నాఁ డాతఁడు
(॥ఎందుకు కైన॥)
పవ్వళించే యేమే నీ పంతనాలో పొంతనాలో
యివ్వల శ్రీవెంకటేశుఁడెడ మియ్యఁగా
దవ్వుల నుండిననన్ను దగ్గరఁ బిలిచే వేమే
నివ్వటిల్ల నాన తీవే నిన్నుఁ గూడె నతఁడు
(||pallavi||)
ĕṁdu kaina vachchu nī yiḍuvaṁṭi bhāvamulu
viṁdugā nādo nāḍave viṁṭā nunnām̐ ḍādaḍu
(||ĕṁdugaina||)
sĕkkunam̐ bĕṭṭevu seyi siggugo siṁtago kāni
takkaga nebadisuddi daḍavidenu
pakkana navve vaṁdugu pagaḍo nī palladamo
vŏkkamāḍĕ āna teve vŏda nunnām̐ ḍādam̐ḍu
(||ĕṁdu kaina||)
tappaga sūse vademe tagalamo kobamo
sippila nādani nī sedi kiyyam̐gā
kuppevu payyadagŏṁgu kasarulo kŏsarulo
vŏppugā nāgum̐ jĕppave vūragunnām̐ ḍādam̐ḍu
(||ĕṁdugu kaina||)
pavvaḽiṁche yeme nī paṁtanālo pŏṁtanālo
yivvala śhrīvĕṁkaḍeśhum̐ḍĕḍa miyyam̐gā
davvula nuṁḍinanannu daggaram̐ bilise veme
nivvaḍilla nāna tīve ninnum̐ gūḍĕ nadam̐ḍu