ఎందరులేరు నీకు నేనేమి బాఁతెయ్యా
(॥పల్లవి॥)
ఎందరులేరు నీకు నేనేమి బాఁతెయ్యా
అంది నాపైఁ జెయివేసేవు అట్టె కానీవయ్యా
(॥ఎందరు॥)
అలిగి నేరాఁగానే అట్టె నావెంట విచ్చేసి
యెలమిఁ బైకొనేవు నేనేమి బాఁతెయ్యా
పలుకకుండఁగ నన్నుఁ బచరించి పచరించి
యెలుఁగిచ్చి మాటాడేవెంత సేసేవయ్యా
(॥ఎందరు॥)
ముసుఁగు వెట్టుకుండఁగ ముచ్చటతోఁ గొంగుదీసి
యిసుమంత నవ్వేవు నేనేమి బాఁతెయ్యా
విసుగుచునున్న నన్ను వేఁడుకొని నీవు నాకే
వసమై పాయవు ఇంతవలెనా నాకయ్యా
(॥ఎందరు॥)
ఆదననేఁ బండుండఁగ నండ నీవూఁ బవళించి
యిదె కాఁగిలించేవు నేనేమి బాఁతెయ్యా
వుదుటు శ్రీవేంకటేశ వొగినలమేలుమంగఁ
నిదివో నన్ను గూడితి వెంతవాఁడవయ్యా
(||pallavi||)
ĕṁdaruleru nīgu nenemi bām̐tĕyyā
aṁdi nābaim̐ jĕyivesevu aṭṭĕ kānīvayyā
(||ĕṁdaru||)
aligi nerām̐gāne aṭṭĕ nāvĕṁṭa vichchesi
yĕlamim̐ baigŏnevu nenemi bām̐tĕyyā
palugaguṁḍam̐ga nannum̐ basariṁchi pasariṁchi
yĕlum̐gichchi māḍāḍevĕṁta sesevayyā
(||ĕṁdaru||)
musum̐gu vĕṭṭuguṁḍam̐ga muchchaḍadom̐ gŏṁgudīsi
yisumaṁta navvevu nenemi bām̐tĕyyā
visugusununna nannu vem̐ḍugŏni nīvu nāge
vasamai pāyavu iṁtavalĕnā nāgayyā
(||ĕṁdaru||)
ādananem̐ baṁḍuṁḍam̐ga naṁḍa nīvūm̐ bavaḽiṁchi
yidĕ kām̐giliṁchevu nenemi bām̐tĕyyā
vuduḍu śhrīveṁkaḍeśha vŏginalamelumaṁgam̐
nidivo nannu gūḍidi vĕṁtavām̐ḍavayyā