Emdaru seppinaa vina vemiseppedi

ఎందరు చెప్పినా విన వేమిచెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎందరు చెప్పినా విన వేమిచెప్పేది
యిందె తగవు దేరె నేమిచెప్పేదే

(॥॥)
వంతువరుసలు గాక వద్దఁ గాచుకుందానవు
యెంతలేదు నీయాసోద యేమిచెప్పేదే
మంతనములాడితివి మరి మాటలాడేవు
యింత గద్దా యేఁకట యేమిచెప్పేదే

(॥॥)
వుమ్మడిఁ బెండ్లాడియును వొడివట్టి తీసేవు
యెమ్మెలు చూపవలెనా యేమిచెప్పేదే
నమ్మికలు గైకొంటివి నవ్వుతానే కొసరేవు
యిమ్ముల నీడేరెఁ బంత మేమిచెప్పేదే

(॥॥)
పట్టపుదేవివై యుండీఁ బలుమారుఁ దనియవు
యిట్టె పెంచేవు మేలు యేమిచెప్పేదే
చుట్టమైననన్ను నేలే నచ్చుగ శ్రీవేంకటేశుఁడు
యిట్టె నీనామంచితన మేమిచెప్పేదే

(||pallavi||)
ĕṁdaru sĕppinā vina vemisĕppedi
yiṁdĕ tagavu derĕ nemisĕppede

(||||)
vaṁtuvarusalu gāga vaddam̐ gāsuguṁdānavu
yĕṁtaledu nīyāsoda yemisĕppede
maṁtanamulāḍidivi mari māḍalāḍevu
yiṁta gaddā yem̐kaḍa yemisĕppede

(||||)
vummaḍim̐ bĕṁḍlāḍiyunu vŏḍivaṭṭi tīsevu
yĕmmĕlu sūbavalĕnā yemisĕppede
nammigalu gaigŏṁṭivi navvudāne kŏsarevu
yimmula nīḍerĕm̐ baṁta memisĕppede

(||||)
paṭṭabudevivai yuṁḍīm̐ balumārum̐ daniyavu
yiṭṭĕ pĕṁchevu melu yemisĕppede
suṭṭamainanannu nele nachchuga śhrīveṁkaḍeśhum̐ḍu
yiṭṭĕ nīnāmaṁchidana memisĕppede