Emdaru gaavale neegu yinnidi kaabe vumdamgaa

ఎందరు గావలె నీకు యిన్నిటి కాపె వుండఁగా
Language

(॥పల్లవి॥)
ఎందరు గావలె నీకు యిన్నిటి కాపె వుండఁగా
సందడించితే వలపు చవులయ్యీనా

(॥ఎంద॥)
వింతచెలి వచ్చినీతో వేడుకకు నవ్వఁగాను
వంతుల కిందరు నవ్వవచ్చునా నీతో
చెంతనుండి విన్నపాలు సేయుచు నాపె వుండఁగా
పంతగత్తె లెడచొచ్చి పలుకఁగవచ్చునా

(॥ఎంద॥)
తాలిమి నాపె నీచేతఁ దమ్ముల మిప్పించుకోఁగా
పాలువెట్టు కందురును పంచవచ్చునా
వోలివెట్టి నీపాదాలొత్తుతా నాపె వుండఁగా
వాలి యెవ్వరైనా సేవలు సేయవచ్చునా

(॥ఎంద॥)
చలపట్టుకొని యాపె చన్నుల నిన్నొత్తఁగాను
కొలువుసతులందరుఁ గూడవచ్చునా
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
కలసితి విఁక నిన్నుఁ గాదనఁగవచ్చునా

(||pallavi||)
ĕṁdaru gāvalĕ nīgu yinniḍi kābĕ vuṁḍam̐gā
saṁdaḍiṁchide valabu savulayyīnā

(||ĕṁda||)
viṁtasĕli vachchinīdo veḍugagu navvam̐gānu
vaṁtula kiṁdaru navvavachchunā nīdo
sĕṁtanuṁḍi vinnabālu seyusu nābĕ vuṁḍam̐gā
paṁtagattĕ lĕḍasŏchchi palugam̐gavachchunā

(||ĕṁda||)
tālimi nābĕ nīsedam̐ dammula mippiṁchugom̐gā
pāluvĕṭṭu kaṁdurunu paṁchavachchunā
volivĕṭṭi nībādālŏttudā nābĕ vuṁḍam̐gā
vāli yĕvvarainā sevalu seyavachchunā

(||ĕṁda||)
salabaṭṭugŏni yābĕ sannula ninnŏttam̐gānu
kŏluvusadulaṁdarum̐ gūḍavachchunā
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
kalasidi vim̐ka ninnum̐ gādanam̐gavachchunā