Emdaru gaavale mariyimkaa neegu

ఎందరు గావలె మరియింకా నీకు
Language

(॥పల్లవి॥)
ఎందరు గావలె మరియింకా నీకు
సందడిలోపల నాకు చనవులిచ్చేవు

(॥ఎంద॥)
వలచిననీవే నావాఁడవై యుండితేఁ జాలు
యెలమి నేఁ గడనుంటే నేమాయను
కులుకి కులికి యేల కొంగువట్టి తీసేవు
చెలులెల్ల నావారే చేరి నీకున్నారు

(॥ఎంద॥)
అచ్చమైననీకు నే నాలననుకొంటేఁ జాలు
యెచ్చుకుందు లేమైనా నేమాయను
పచ్చిగా నాగడ్డము పట్టేల వేఁడుకొనేవు
యిచ్చట నాచెల్లెండ్లె ఇందురునుఁగారా

(॥ఎంద॥)
యింతట శ్రీవేంకటేశ యిటు గూడితివి చాలు
యెంత వెనకనైనాను యేమాయను
పంతమిచ్చి నాకేల బాసలు సేసే విప్పుడు
వింతవారా వూడిగపు వెలఁదులు మనకు

(||pallavi||)
ĕṁdaru gāvalĕ mariyiṁkā nīgu
saṁdaḍilobala nāgu sanavulichchevu

(||ĕṁda||)
valasinanīve nāvām̐ḍavai yuṁḍidem̐ jālu
yĕlami nem̐ gaḍanuṁṭe nemāyanu
kulugi kuligi yela kŏṁguvaṭṭi tīsevu
sĕlulĕlla nāvāre seri nīgunnāru

(||ĕṁda||)
achchamainanīgu ne nālananugŏṁṭem̐ jālu
yĕchchuguṁdu lemainā nemāyanu
pachchigā nāgaḍḍamu paṭṭela vem̐ḍugŏnevu
yichchaḍa nāsĕllĕṁḍlĕ iṁdurunum̐gārā

(||ĕṁda||)
yiṁtaḍa śhrīveṁkaḍeśha yiḍu gūḍidivi sālu
yĕṁta vĕnaganainānu yemāyanu
paṁtamichchi nāgela bāsalu sese vippuḍu
viṁtavārā vūḍigabu vĕlam̐dulu managu