Emdarim bemdlaadinaa neegemaayanu

ఎందరిఁ బెండ్లాడినా నీకేమాయను
Language

(॥పల్లవి॥)
ఎందరిఁ బెండ్లాడినా నీకేమాయను
అందుకుఁగానే నిన్ను నౌఁగాదనేనా

(॥॥)
వలచి వచ్చితినని వనిత వేఁడుకొనఁగా
చెలిమి సేయక యేల సిగ్గువడేవు
సొలపుఁ జూపుల నిన్నుఁ జూచిచూచి కొసరఁగా
తలవంచుకొని యేల తప్పించుకొనేవు

(॥॥)
కాఁపురము సేయవచ్చి కాచుకొని యాపె వుండఁగా
యేపున నీవు నెలవి నేల నవ్వేవు
పైపై నీతమ్ములానకు భామ చేయిచాఁచఁగాను
రాఁపుజాణతనా లేల రచ్చలో నాడేవు

(॥॥)
వేడుకతో నాపె నీకు వెసఁ బాదాలొత్తరాఁగా
కూడుదువు గాక యేల గుట్టుచూపేవు
యీడనె శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
వీడెమిచ్చేసతి నేల వింతసేసేవు

(||pallavi||)
ĕṁdarim̐ bĕṁḍlāḍinā nīgemāyanu
aṁdugum̐gāne ninnu naum̐gādanenā

(||||)
valasi vachchidinani vanida vem̐ḍugŏnam̐gā
sĕlimi seyaga yela sigguvaḍevu
sŏlabum̐ jūbula ninnum̐ jūsisūsi kŏsaram̐gā
talavaṁchugŏni yela tappiṁchugŏnevu

(||||)
kām̐puramu seyavachchi kāsugŏni yābĕ vuṁḍam̐gā
yebuna nīvu nĕlavi nela navvevu
paibai nīdammulānagu bhāma seyisām̐sam̐gānu
rām̐pujāṇadanā lela rachchalo nāḍevu

(||||)
veḍugado nābĕ nīgu vĕsam̐ bādālŏttarām̐gā
kūḍuduvu gāga yela guṭṭusūbevu
yīḍanĕ śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
vīḍĕmichchesadi nela viṁtasesevu